గురుగ్రామ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: కారుపై పడిన ట్రక్కు, నలుగురు మృతి

Published : Aug 17, 2022, 06:15 PM IST
గురుగ్రామ్ లో  ఘోర రోడ్డు ప్రమాదం:  కారుపై పడిన ట్రక్కు, నలుగురు మృతి

సారాంశం

ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కు మరో రోడ్డులో ప్రయాణీస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 

న్యూఢిల్లీ: ఢీల్లీ-జైపూర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గురుగ్రామ్ శివారులో మంగళవారం నాడు తెల్లవారుజామున .ఈ ఘటన చోటు చేసుకొంది.  డివైడర్ ను దాటుకొని మరో రోడ్డులో ప్రయాణీస్తున్న కారుపై పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  కారులో ఇద్దరు మహిళలు, డ్రైవర్ సహా కారులో ఆరుగురున్నారు. ఉదయ్ పూర్ నుండి వీరంతా నోయిడాకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  మృుతుల్లో ఓ మహిళ, ఇద్దరు పురుషులు, డ్రైవరున్నట్టుగా పోలీసులు ధృవీకరించారు.

ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలతో పాటు గాయపడిన వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్టుగా  బిలాస్ పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ మాలిక్ చెప్పారు. మృతదేహాలను మార్చురీకి తరలించినట్టుగా ఆయన చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. . కారులో ప్రయాణీస్తున్న వారంతా నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు.


 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !