
దేశంలో తొట్ట తొలిసారి కంటెంట్ క్రియేటర్స్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఢిల్లీలోని భారత్ మండప్‌లో నిర్వహించారు. 23 క్యాటరిజ్‌లలో యువతకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డులను ప్రదానం చేస్తూ అవార్డులు పొందిన యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాజువల్‌గా మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారితో మాట్లాడినప్పటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : నారీ శక్తి బలోపేతానికి మరో అడుగు : ప్రధాని మోడీ పై షెహజాద్ పూనావాలా ప్రశంసలు
దేశంలో మార్పు తీసుకురావడానికి యువ క్రియేటర్లు కృషి చేస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. వీరికి ఇక నుంచి మంచి ఆదరణ ఉంటుందని తెలిపారు. వారి క్రియేటివిటీని గౌరవించాలనే ఉద్దేశ్యం తోనే ఈ అవార్డులు అందిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అవార్డీలతో మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఇవే.