సోమవారం సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

By Siva KodatiFirst Published Jan 8, 2021, 6:51 PM IST
Highlights

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పనులన్ని పూర్తి చేసింది. ఈ నేపధ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పనులన్ని పూర్తి చేసింది. ఈ నేపధ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

టీకా పంపిణీ, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు వంటి ప్రధాన అంశాలపై ప్రధాని .. సీఎం అభిప్రాయాలను సేకరించడంతో పాటు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. 

కాగా, జనవరి 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసింది. ఇప్పటికే దేశంలో కర్నాల్, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని 37 స్టోరేజ్ సెంటర్లలో వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్రం పూర్తి చేసింది.

click me!