భర్తకు దొంగల షాక్.. భార్యతో సహా కారు ఎత్తుకెళ్లి..

Published : Jan 08, 2021, 02:20 PM IST
భర్తకు దొంగల షాక్.. భార్యతో సహా కారు ఎత్తుకెళ్లి..

సారాంశం

కారుకి తాళం అలానే ఉంచి అతను మాత్రం స్కూల్లోకి వెళ్లిపోయాడు.  ఆయన భార్య రీతూ మాత్రం కారులోనే భర్త కోసం ఎదురుచూస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు కారులోకి చొరపడ్డారు.

ఓ వ్యక్తి భార్యను కారులో ఉంచి పని మీద బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి కారు లేదు.. అతని భార్య కూడా లేదు. కారు.. అతని భార్య తీసుకువెళ్లి ఉంటుందని మీరు అనుకుంటే పొరపాటుపడినట్లే. ఎందుకంటే.. ఆమె కారుని ఎక్కడికీ తీసుకెళ్లలేదు. ఆమెను, ఆమెతో సహా కారుని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని డేరాబస్సిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డేరా బస్సీ ప్రాంతానికి చెందిన రాజీవ్ చంద్, రీతు దంపతులు తమ పిల్లల స్కూల్ ఫీజు చెల్లించడానికి స్కూల్ దగ్గరకు వచ్చారు. కారుకి తాళం అలానే ఉంచి అతను మాత్రం స్కూల్లోకి వెళ్లిపోయాడు.  ఆయన భార్య రీతూ మాత్రం కారులోనే భర్త కోసం ఎదురుచూస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు కారులోకి చొరపడ్డారు.

ఒకరు డ్రైవింగ్‌ సీటులో కూర్చోగా.. మరొకరు రీతు నోరును గుడ్డ ముక్కతో మూసి, కారును తీసుకెళ్లిపోయారు. దాదాపు ఐదు కిలోమీటర్లు వెళ్లిన అనంతరం రీతును ఓ చోట కిందకు తోసి కారును తీసుకెళ్లిపోయారు.  స్కూల్లో పని ముగించుకుని బయటకు వచ్చిన రాజీవ్‌ అక్కడ కారు కనిపించకపోయే సరికి కంగారుపడ్డాడు. భార్యకు ఫోన్‌ చేసినా స్పందించకపోయే సరికి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. కాగా, కొన్ని గంటల తర్వాత రీతు ఇంటికి చేరుకోవటంతో రాజీవ్‌ ఊపిరి పీల్చుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..