అఖిలేష్ యాదవ్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు.. మహిళల సంక్షేమం కోసమే వివాహ వయసు పెంపు..

By Sumanth KanukulaFirst Published Dec 21, 2021, 4:03 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi).. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. అందులో భాగంగా అమ్మాయిల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రణాళిక అని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi).. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. అందులో భాగంగా అమ్మాయిల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రణాళిక అని అన్నారు. శాంతి భద్రతలను మెరుగుపరచడం నుంచి విద్య, ఆర్థిక రంగాల వరకు మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. 'ఐదేళ్ల క్రితం వరకు ఉత్తరప్రదేశ్‌లో మాఫియా రాజ్‌లు, గూండారాజ్‌లు ఉండేవారు. వారి వల్ల ఎక్కువగా నష్టపోయేది మహిళలే.. కానీ వీరు ఏమి అనలేరు. పోలీస్‌స్టేషన్‌లకు వెళితే.. రేపిస్టులు, నేరస్తులకు అనుకూలంగా పోన్ కాల్స్ వచ్చేవి. కానీ యోగి ఆదిత్యనాథ్ మాత్రం నేరస్థులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు’ అని అన్నారు.

మహిళలకు వివాహ వయస్సు పెంపును పలు విపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వివాదాస్పదంగా మారింది. అయితే మహిళల వివాహ వయసు.. పురుషులతో సమానంగా ఉండటాన్ని మోదీ సమర్థించారు. ‘కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు మహిళల వివాహ వయస్సు 18 ఏళ్లు. అయితే అమ్మాయిలు కూడా చదువుకోవడానికి ఎక్కువ సమయం కావాలని కోరుకుంటారు. అందుకే వివాహ వయస్సును 21కి పెంచడానికి ప్రయత్నిస్తున్నాము’ మోదీ తెలిపారు. అని ఆయన అన్నారు. అన్నారు. "ఎవరికైనా దానితో సమస్య ఉంటే, వారు (మహిళలు) కూడా చూస్తారు."

‘మహిళలు ఇకపై తమ ఇళ్లకే పరిమితం కావాలని కోరుకోవడం లేదు. అందుకే.. రాష్ట్రంలో తమకు ఏమీ చేయని గత ప్రభుత్వాలను తిరిగి అధికారంలోకి తీసుకురాకూడదని భావిస్తున్నారు. ఏ పార్టీ తమ ప్రయోజనాల కోసం పనిచేస్తుందో మహిళలకు తెలుసు’ మోదీ పేర్కొన్నారు. మొత్తంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ కన్నా ముందు  అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్‌ (Akhilesh Yadav) పార్టీని టార్గెట్ చేసుకుని మోదీ ప్రసంగం కొనసాగింది.  ఇక, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీలో గత నెల వ్యవధిలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది 10వ సారి.
 

click me!