Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి మూక దాడులు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. 2014కు ముందు మూకదాడుల మాటే వినలేదని.. థ్యాంక్యూ మోడీజీ అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Rahul Gandhi: కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో విమర్శలు, ఆరోపణల్లో మరింత పదును పెంచాయి ఇరు పార్టీలు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలతో రెచ్చిపోయారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు మూక హత్యల ఘటనల గురించి అసలు వినేవారం కాదని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కేంద్రంలో కొలువుదిరిన తర్వాత ఇప్పుడు నిత్యం మూకదాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన మోడీ సర్కారు అధికారంలోకి రాకముందు మూకదాడులు గురించి వినలేదని.. ప్రస్తుత పరిస్థితులు, మూకదాడులను ఎత్తి చూపుతూ. థ్యాంక్యూ మోడీజీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ. 2014కి ముందు 'లించింగ్' అనే పదం వినిపించేదని కాదనీ, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు.
Also Read: AP: బీ ఫార్మసీ విద్యార్థిపై కత్తితో దాడి.. విజయనగరంలో ఘటన
undefined
పంజాబ్‌లో ఇటీవల జరిగిన మూక దాడి హత్యల ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. "సిక్కు మతపరమైన మనోభావాలను కించపరిచారు" అనే ఆరోపణతో 24 గంటలలోపు ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపిన తరువాత , హత్యాకాండ కేసులలో కఠినమైన శిక్షలు విధించేలా ప్రతిపాదిత బిల్లులకు ఆమోదం తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. కాగా, ఇటీవలి కాలంలో మూకదాడులు, మూక హత్య ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎక్కువగా ఉత్తరప్రదేశ్, అసోంలతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మూక దాడులు అధికంగా నివేదించబడ్డాయి. ఈ దాడులు పెరుగుతుండటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు ఇదివరకు చేసింది. ఈ మూక దాడులను అరికట్టడానికి రాజస్థాన్, మణిపూర్‌లు బిల్లులను ఆమోదించగా, అసోం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పరిశీలిస్తున్నాయి. బీజేపీ పాలిత అసోంలో గత కొన్ని రోజులుగా మూక హత్యలు పెరుగుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది నవంబర్ 29న జోర్హాట్‌లో 28 ఏళ్ల ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) నాయకుడిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపారు. చాలా మంది ఈ ఘటనను చూస్తూ.. తమ మోబైల్ చిత్రీకరించారు తప్పా.. ఎవరూ ఆపడానికి ప్రయత్నించలేదు. ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.
Also Read: Omicron: భారత్ లో ఒమిక్రాన్ డబుల్ సెంచరీ !
ప్రస్తుతం మూకదాడులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సైతం ఘాటుగానే స్పందించింది. రాహుల్ ట్వీట్‌పై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కుల ఊచకోతను సమర్ధిస్తూ మూకహత్యలకు రాహుల్ తండ్రి లాంటి వాడని ఎదురుదాడికి దిగారు. సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన మారణహోమాన్ని కాంగ్రెస్ సమర్ధించిందని ఆరోపించారు. కాల్వల్లో పడేసిన దగ్ధమైన మృతదేహాలను కుక్కలు పీక్కుతిన్నాయని మాలవీయ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పాలిత పంజాబ్‌లో సిక్కుల ప్రార్ధనాలయాలను అపవిత్రం చేశారని ఇద్దరు వ్యక్తులను కొందరు కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన ఈ మూకదాడుల ట్వీట్.. తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ట్వీట్ వైరల్ మారింది. ఇదిలావుండగా మరో కాంగ్రెస్ నేత సిక్కు పార్థన ఆలయాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రార్ధనాలయాలను అపవిత్రం చేసేవారిని బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు.
Also Read: Omicron: ఒక ఈవెంట్ కంటే జీవితం ఎంతో ముఖ్యం.. ఒమిక్రాన్ నేపథ్యంలో WHO వ్యాఖ్యలు