ప్ర‌ధాని కాన్వాయ్ ని అడ్డుకున్న నిర‌స‌న‌కారులు.. ప్లైఓవ‌ర్‌పై 15నిమిషాల పాటు ప్ర‌ధాని !

By Mahesh Rajamoni  |  First Published Jan 5, 2022, 3:09 PM IST

ఛండీగ‌ఢ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే, తన షెడ్యూల్ చేసిన పర్యటనను ప్రధాన భద్రతా లోపం కారణంగా రద్దు చేసుకున్నారు.  హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్‌కు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు రహదారిని అడ్డుకున్నట్లు కనుగొనబడింది. ప్రధాని 15-20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై ఇరుక్కుపోయారు. ప్రధాని భద్రతలో ఇది అతిపెద్ద లోపం అని చెప్పాలి.  
 


PM Modi stuck on flyover : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే, తన షెడ్యూల్ చేసిన పర్యటనను ప్రధాన భద్రతా లోపం కారణంగా రద్దు చేసుకున్నారు.  హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్‌కు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు రహదారిని అడ్డుకున్నట్లు కనుగొనబడింది. ప్రధాని 15-20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై ఇరుక్కుపోయారు. ప్రధాని భద్రతలో ఇది అతిపెద్ద లోపం అని చెప్పాలి.  

Also Read: Caste: coronavirus: జేజే హాస్పిట‌ల్‌లో 61 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్‌

Latest Videos

undefined

భద్రతా లోపం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయినట్టు హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ''ప్రధాని కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ దగ్గరకు చేరుకునేటప్పటికి కొందరు నిరసనకారులు రోడ్డును దిగ్బంధించినట్టు గుర్తించారు. ప్రధాని ఫ్లైఓవర్‌పైనే 15 నుంచి 20 నిమిషాలు చిక్కుకుపోయారు. ప్రధాని భద్రతకు సంబంధించిన ఇది కీలకమైన లోపం''అని హోం మంత్రిత్వ శాఖ త‌న ప్రకటనలో పేర్కొంది.

Also Read: Caste: CSD Bipin Rawat: బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంపై నివేదిక.. పైలెట్ చివ‌ర‌గా ఏం చెప్పారంటే..

కాగా, దేశంలో ఏడాది ఐదు రాష్ట్రాల్లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అందులో పంజాబ్ కూడా ఒక‌టి.  ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోడీ  పంజాబ్‌లో పర్యటిస్తుండగా, రైతు చట్టాల రద్దు తర్వాత పర్యటించడం ఇదే మొదటిసారి. షెడ్యూల్ ప్రకారం ప్రధాని ఫిరోజ్‌పూర్‌లో జరిగే ర్యాలీలో పాల్గొనాల్సి ఉండగా, దీనికి ముందు సభా వేదికకు దారితీసే మూడు అప్రోచ్ రోడ్డులను కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ  (కేఎంసీసీ) దిగ్బంధించింది. రైతుల డిమాండ్లపై జనవరి 15న చర్చిస్తారనే హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళ‌న విర‌మించిన‌ట్టు స‌మాచారం.  ఇదిలావుండ‌గా, ప్ర‌ధాని మోడీ కాన్వాయ్ ని అడ్డుకోవ‌డంపై బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా పంజాబ్ అధికార పార్టీ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే భ‌యంతోనే పంజాబ్ కాంగ్రెస్.. ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌కు అన్ని విధాలుగా అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేసింద‌ని జేపీ న‌డ్డా ఆరోపించారు.

Also Read: Caste: Assembly Elections2022: కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. యూపీలో ర్యాలీలు రద్దు.. ఎందుకంటే?

 రాష్ట్రంలో ప్ర‌ధాన మంత్రి భగత్ సింగ్ & ఇతర అమరవీరులకు నివాళులు అర్పించాలనుకున్నార‌నీ, అలాగే, ప‌లు కీలకమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలనే విష‌యాల‌ను కాంగ్రెస్ స‌ర్కారు ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. మోడీ కాన్వాయ్ ని అడ్డుకోవ‌డం చౌక‌బారు చ‌ర్య‌గా ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అభివృద్ధికి వ్య‌తిరేక‌, స్వాతంత్య్ర సమరయోధుల పట్ల కూడా గౌరవం లేదని దీంతో నిరూపించింద‌ని ఆరోపించారు.  ఇది అతిపెద్ద భ‌ద్ర‌తా లోపం అనీ, ప్ర‌ధానికి ఇలా జ‌ర‌గ‌డం ఆందోళ‌నక‌ర‌మైన విష‌య‌మ‌ని పేర్కొన్నారు. పంజాబ్ కోసం వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని పర్యటనకు విఘాతం కలగడం బాధాకరం. కానీ మేము అలాంటి చీఫ్ రాజ‌కీయాల‌తో పంజాబ్ పురోగ‌తిని అడ్డుకోనివ్వ‌మ‌నీ.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.

Also Read: Caste: పాఠశాలలో కుల విభజన.. ఏపీలో ఘటన... సర్వత్రా ఆగ్రహం

 

Fearing a resounding defeat at the hands of the electorate, the Congress Government in Punjab tried all possible tricks to scuttle the PM Ji’s programmes in the state.

— Jagat Prakash Nadda (@JPNadda)
click me!