coronavirus: జేజే హాస్పిట‌ల్‌లో 61 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్‌

By Mahesh Rajamoni  |  First Published Jan 5, 2022, 2:28 PM IST

coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెరుతోంది.  కొత్త కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుత‌న్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ సైతం చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. ఇదే స‌మ‌యంలో క‌రోనా బారిన‌ప‌డుతున్న వైద్యుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 
 


coronavirus: భార‌త్ లో క‌రోనావైర‌స్ ఉధృతి మొద‌లైంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన, వేగంగా వ్యాపిస్తున్న coronavirus కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం పెరుగుతున్నాయి. అయితే, క‌రోనా బారిన‌ప‌డుతున్న వారిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎక్కువ సంఖ్య‌లో ఉండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. క‌రోనావైర‌స్ పంజా విసురుతున్న మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబ‌యి (Mumbai) లోని జేజే హాస్పిట‌ల్‌లో coronavirus మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం రేపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆ ఆస్ప‌త్రిలో 61 మంది రెసిడెంట్ డాక్టర్లు క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ నేప‌థ్యంలో జేజే ఆస్ప‌త్రి యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మై క‌రోనా సోకిన వైద్యుల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచింది. ఒక్క జేజే ఆస్ప‌త్రిలోనే కాదు, రాష్ట్ర‌వ్యాప్తంగా కూడా క‌రోనా బారిన‌ప‌డుతున్న రెసిడెంట్ డాక్ట‌ర్ల సంఖ్య పెరుగుతున్న‌ద‌ని మ‌హారాష్ట్ర రెసిడెంట్ డాక్ట‌ర్స్ అసోషియేష‌న్  వెల్ల‌డించింది. గ‌డిచిన 48 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌హారాష్ట్ర‌ వ్యాప్తంగా 170 మంది రెసిడెంట్ డాక్ట‌ర్ల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. వారిలో రాజ‌ధాని ముంబైలోనే 120 మంది  ఉన్నార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. క‌రోనా బారిన‌ప‌డ్డ రెసిడెంట్ డాక్ట‌ర్ల‌లో స‌గం మందికి పైగా ఒక్క జేజే హాస్పిట‌ల్‌లోనే ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.

Also Read: Caste: CSD Bipin Rawat: బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంపై నివేదిక.. పైలెట్ చివ‌ర‌గా ఏం చెప్పారంటే..

Latest Videos

undefined

ఇదిలావుండ‌గా, మ‌హారాష్ట్రలో coronavirus కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు మ‌హారాష్ట్రలోనే న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో ఇక్క‌డ 18,466 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 67,30,494కు పెరిగాయి. ఇదే స‌మ‌యంలో 20 మంది క‌రోనా వైర‌స్‌తో పోరాడుతూ  ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,41,573కు పెరిగింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం మహారాష్ట్రలో పెరుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ మొత్తం 653  ఒమిక్రాన్ వేరియంట్ చేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం 394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 259 మంది కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే బుధ‌వారం నాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి క‌రోనాపై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. లాక్‌డౌన్ విధిస్తారంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు ఆయ‌న చెక్ పెట్టారు. లాక్‌డౌన్ విధించ‌బోమ‌ని స్ఫ‌ష్టం చేసింది.

Also Read: Caste: Assembly Elections2022: కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. యూపీలో ర్యాలీలు రద్దు.. ఎందుకంటే?

ఇదిలావుండ‌గా,  బీహార్‌ రాష్ట్రంలో చాలా మంది వైద్యులు coronavirus బారిన‌ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతున్న‌ది.  పాట్నాలోని నలందా మెడికల్‌ కళాశాల, ఆస్పత్రిలో (NMCH) పని చేస్తున్న 159 మంది వైద్యులకు కరోనా రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ స్థాయిలో కేసులు న‌మోదుకావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కరోనా సోకిన వైద్యులకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వారంతా ఆస్పత్రిలో క్యాంపస్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాట్నా డిస్టిక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ తెలిపారు. ఇటీవల కాలంలో పాట్నాలో జరిగిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కార్యక్రమంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు. ఇందులో నలందా మెడికల్‌ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వైద్యులు, విద్యార్థుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వీరంద‌రూ కూడా coronavirus ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Caste: పాఠశాలలో కుల విభజన.. ఏపీలో ఘటన... సర్వత్రా ఆగ్రహం

click me!