ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిది?.. వారి తప్పిదమేనా?.. మాజీ డీజీపీ ఏం చెప్పారంటే..

By Sumanth Kanukula  |  First Published Jan 6, 2022, 11:23 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం (PM Modi security lapse) తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ప్రధాని భద్రతకు సబంధించి మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ ఎన్‌కే త్రిపాఠి‌ (NK Tripathi) కీలక విషయాలను వెల్లడించారు.


ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం (PM Modi security lapse) తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భద్రతా లోపం కారణంగా ప్రధాని మోదీ కాన్వాయ్ పంజాబ్‌లో ఫ్లైఓవర్‌పై బుధవారం 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైతులు రోడ్డుపై నిరసన తెలుపడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తన ఫిరోజ్‌పూర్‌ పర్యటనను రద్దు చేసుకుని తిరిగి బఠిండా చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. అయితే భద్రతా ఏర్పాట్లు పూర్తయినట్లు Punjab డీజీపీ ధ్రువీకరించిన తర్వాతే ప్రధాని మోదీ కాన్వాయ్ ముందుకు కదిలినట్టుగా కేంద్ర హోం శాఖ తెలిపింది. ఆ తర్వాత కూడా కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో నిరసనకారులు ఉండటంతో.. ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

అయితే ఇది ఎవరి తప్పు అనేదానిపై ప్రస్తుతం తీవ్ర చర్చ సాగుతుంది.అయితే ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ.. భద్రతా వైఫల్యంపై పంజాబ్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రధాని కాన్వాయ్ వెళ్తున్న మార్గం గురించి పంజాబ్ పోలీసులకు మాత్రమే తెలుసు. 

Latest Videos

undefined

Also read: ప్రధాని మోదీ వెళ్తున్న రూట్ వాళ్లే మాకు లీక్ చేశారు.. రైతు సంఘం నేత సంచలన వ్యాఖ్యలు..

అయితే ప్రధాని కాన్వాయ్‌ వెళ్తున్న మార్గంలో భద్రతా వైఫల్యంపై.. మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ ఎన్‌కే త్రిపాఠి‌ (NK Tripathi)తో Asianet News మాట్లాడింది. అయితే ఇది పూర్తిగా పంజాబ్ డీజీపీ నిఘా సంస్థల తప్పిదమని NK Tripathi చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధాని భద్రతకు సంబంధించి ఆయన చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి..

ప్రధానమంత్రి రూట్‌ను క్లియర్‌గా ఉంచడం స్థానిక పోలీసుల బాధ్యత..
ప్రధానమంత్రి ప్రయాణించాల్సిన మార్గాన్ని క్లియర్‌‌గా ఉంచాల్సిన బాధ్యత స్థానిక పోలీసులపై ఉంది. పోలీసులు ఈ పనిని చేయలేకపోతే.. అదే విషయాన్ని ఎస్‌పీజీకి (Special Protection Group) తెలియజేయాలి. అలా చేయడం ద్వారా కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. భారత ప్రధాని ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఆయన కోసం అన్ని  ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అన్నారు.

రెండు దశల్లో భద్రత
ప్రధానమంత్రికి భద్రత రెండు దశల్లో జరుగుతుంది. ప్రధాని భద్రతకు SPG బాధ్యత వహిస్తుంది. ఎలైట్ కమాండోస్‌ ప్రధాని సన్నిహిత భద్రత కల్పించే బాధ్యతను కలిగి ఉంది. ఆ తర్వాత తక్షణ భద్రత SPG తీసుకుంది. అయితే బయట ఎవరు నిల్చున్నారు.. మార్గంలో ఎవరు అడ్డుగా ఉన్నారనేది స్థానిక పోలీసుల బాధ్యత. ఇందుకోసం ప్రధాని రాకకు ముందే ఆ మార్గాన్ని స్థానిక పోలీసులు క్లియర్ చేయాలి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీజీతో పంచుకోవాలి.

ఈ ఘటనకు బాధ్యులెవరు..?
ఈ ఘటనకు రాష్ట్ర పోలీసులదే పూర్తి బాధ్యత అని NK Tripathi చెప్పారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర పోలీసులు ఏవిధంగా ఏర్పాట్లు చేశారో డీజీపీ పర్యవేక్షించి ఉండాల్సింది. ప్రధానమంత్రి ప్రయాణిస్తున్న రూట్‌ను సురక్షితంగా ఉంచడం రాష్ట్ర పోలీసుల బాధ్యత.. కాబట్టి రాష్ట్ర వనరులను ఉపయోగించి DGP అదనపు బలగాలను మోహరించాల్సింది.

గతంలో ఎప్పుడూ జరగలేదు..
భద్రతా లోపం కారణంగా దేశ ప్రధాని.. తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి రావలసి వచ్చిన సంఘటన గతంలో ఎన్నడూ జరగలేదని మాజీ డీజీపీ అన్నారు. ఈ కేసులో పంజాబ్ పోలీసుల పాత్ర పెద్దగా లేదని..నిఘా సంస్థల వైఫల్యమేనని అన్నారు. 

ప్రధాని భద్రతా ఏర్పాట్లు ఇలా ఉంటాయి..
ప్రధానమంత్రి పర్యటనకు 4 నుంచి 5 గంటల ముందు స్థానిక పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ప్రధానమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గంలో వీధులకు ఇరువైపులా 50 నుంచి 100 మీటర్ల దూరంలో పోలీసులను మోహరిస్తారు. ప్రధానమంత్రి కాన్వాయ్ వెళ్లడానికి 10 నుంచి 15 నిమిషాల ముందు ఆ మార్గంలో ప్రజల రాకపోకలపై పూర్తి నిషేధం ఉంటుంది.

click me!