భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్క రోజే 90 వేలకు పైగా కొత్త కేసులు.. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్

By Sumanth KanukulaFirst Published Jan 6, 2022, 10:35 AM IST
Highlights

దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. మరోసారి రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 90 వేలు దాటింది. 

దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. మరోసారి రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 90 వేలు దాటింది.   గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా  90,928 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా Covidతో 325 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,876కి చేరింది. నిన్న దేశంలో కరోనా నుంచి 19,206 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,43,41,009కి చేరంది. ప్రస్తుతం దేశంలో 2,85,401 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 97.81 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉందని పేర్కొంది. వీక్లీ పాజిటివ్ రేటు 3.47 శాతంగా ఉన్నట్టుగా వెల్లడించింది. దేశంలో బుధవారం మరో 91,25,099 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,48,67,80,227కి చేరింది. 

Also Read: భారత్‌లో ఒమిక్రాన్‌తో తొలి మరణం.. భయపెడుతున్న కరోనా కేసుల పెరుగుదల.. కేంద్రం ఏం చెప్పిందంటే.

పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
మరోవైపు దేశంలో Omicron Varient కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో ఇప్పటివరకు 2,630 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 995 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 797 ఒమిక్రాన్ కేసుల నమోదయ్యాయి. 465 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలో మొత్తం 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. 

ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. మహారాష్ట్రలో 797, ఢిల్లీలో 465, రాజస్తాన్‌లో 236, కేరళలో 234, కర్ణాటకలో 226, గుజరాత్‌లో 204, తమిళనాడులో 121, తెలంగాణలో 94, హర్యానాలో 71, ఒడిశాలో 60, ఉత్తరప్రదేశ్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 28, పశ్చిమ బెంగాల్‌లో 20, మధ్యప్రదేశ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 8, గోవాలో 5, మేఘలయాలో 4, చంఢీఘర్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 3, అండమాన్ నికోబార్‌లో 2, అస్సోంలో 2, పుదుచ్చేరిలో 2, పంజాబ్‌లో 2, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్‌లో1కేసులు నమోదయ్యాయి. 

తెలంగాణలో ఇప్పటివరకు 94 ఒమిక్రాన్ కేసుల నమోదు కాగా.. 37 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీ విషయానికి వస్తే ఇప్పటివరకు 28 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఆరుగురు కోలుకున్నట్టుగా వెల్లడించింది. 

click me!