PM Modi: ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం.. హమాస్ ఉగ్ర దాడిని ఖండించిన ప్రధాని మోదీ 

Published : Oct 08, 2023, 06:16 AM IST
PM Modi: ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం.. హమాస్ ఉగ్ర దాడిని ఖండించిన ప్రధాని మోదీ 

సారాంశం

PM Modi: హమాస్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ప్రధాని మోదీ సంఘీభావం ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిని ఉగ్రవాద దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. 

PM Modi: ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఇస్లామిక్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. హమాస్ మిలిటెంట్లు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. దీంతో  ఇజ్రాయెల్ ప్రతిదాడి మొదలెట్టింది. ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్  జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ తరుణంలో హమాస్ రాకెట్ దాడిలో 40 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 

కాగా, ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను ప్రధాని మోదీ ఖండించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి దిగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో   భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కష్టకాలంలో తాము ఇజ్రాయెల్‌తో ఉన్నామనీ, అమాయక పౌరుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందినట్లు తెలిపారు. బాధితులు, వారి కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని  ప్రకటించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉన్న స్థానికులు, విదేశాలకు చెందిన పౌరులు క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు భారత్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
   

ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందనపై భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ నైతిక మద్దతు తమకు ఎంతో అవసరమని చెప్పారు. ఇరుదేశాల మద్దతు ఇజ్రాయెల్ బలపడుతుందని, హమాస్ ఉగ్రవాదులపై విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
బ్రిటన్ ప్రధాని సంతాపం

 

ఈ ఘటనకు సంబంధించి యూకే పీఎం రిషి సునక్ మాట్లాడుతూ.. శనివారం ఉదయం ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల పట్ల నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. మేము ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము. ఇజ్రాయెల్‌లోని బ్రిటిష్ పౌరులు ప్రయాణ సలహాను పాటించాలని తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దళ ట్వీట్ ప్రకారం.. ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు ఇప్పుడు గాజా స్ట్రిప్‌లోని అనేక ప్రదేశాలలో ఉగ్రవాద సంస్థ హమాస్ స్థానాలపై దాడి చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కారణంగా.. ఇజ్రాయెల్‌లోని తన పౌరులకు భారతదేశం ఒక సలహా జారీ చేసింది.
 

PREV
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !