
అమెరికా, ఈజిప్టు పర్యటనలను ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం దేశ రాజధానిలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు అమిత్ షా ప్రధాని మోడీని కలిసి మణిపూర్ పరిణామాలను వివరించారు.
ఆదివారం మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హింసను చాలా వరకు నియంత్రించగలిగాయని అన్నారు. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు అమిత్ షా శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
హింసాకాండతో అతలాకుతలమైన రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదిలా వుండగా.. ఆరు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటనలను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి, హన్స్ రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ సహా వివిధ పార్టీ ఎంపీలు మోడీకి పాలం విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈజిప్టులో తన తొలి పర్యటనకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
గంటల తరబడి నిరీక్షించినా స్టాప్ లో ఆగడం లేదని.. బస్సు కిటికీని రాయితో పగులగొట్టిన మహిళ..
దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన ప్రధాని మోడీ.. ‘నా ఈజిప్ట్ పర్యటన చారిత్రాత్మకమైనది. ఇది భారత్-ఈజిప్టు సంబంధాలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈజిప్టు అధ్యక్షుడు, ప్రభుత్వం, ప్రజల అభిమానానికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ జూన్ 21 నుంచి 24 వరకు అమెరికాలో, జూన్ 24 నుంచి 25 వరకు ఈజిప్టులో అధికారిక పర్యటనలో ఉన్నారు.