ఆరేళ్ల పిల్లాడి టైమ్ టేబుల్... ఎంత గొప్ప ప్లానింగ్, కానీ..!

Published : Jun 26, 2023, 04:10 PM IST
ఆరేళ్ల పిల్లాడి టైమ్ టేబుల్... ఎంత గొప్ప ప్లానింగ్, కానీ..!

సారాంశం

ఆ టేబుల్ లో అతను దేని కోసం ఎంత సమయం కేటాయించాలి అనుకుంటున్నాడు అనే విషయం ఇప్పుడు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చదువు కోవడానికి ఒక రోజు మొత్తంలో 15 నిమిషాలు కేటాయించడం విశేషం.  


పిల్లలు చేసే పనులు మనకు భలే సరదాగా అనిపిస్తాయి. కొన్ని మనకు కోపం తెప్పించినా, ఆ తర్వాత నవ్వు కూడా తెప్పిస్తాయి.  తాజాగా ఓ ఆరేళ్ల పిల్లాడు చేసిన ఓ పని అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాదాపు ఆరేళ్ల పిల్లాడు అంటే, ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంటాడు. అలాంటి పిల్లాడు తన కోసం తాను స్పెషల్ గా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాడు.

అంత చిన్న వయసులో టైమ్ టేబుల్ తయారు చేసుకొని ఉంచుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం. అసలు ఈ చిన్నారి ప్రయత్నం కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అయితే, ఆ టేబుల్ లో అతను దేని కోసం ఎంత సమయం కేటాయించాలి అనుకుంటున్నాడు అనే విషయం ఇప్పుడు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చదువు కోవడానికి ఒక రోజు మొత్తంలో 15 నిమిషాలు కేటాయించడం విశేషం.

 

తనకు వాష్ రూమ్ కి వెళ్లడానికి 30 నిమిషాలు,  బ్రేక్ ఫాస్ట్ చేయడానికి 30 నిమిషాలు, టీవీ చూడటానికి ఒక గంట, ఫైటింగ్ చేయడానికి మూడు గంటలు , స్నానానికి 30 నిమిషాలు కేటాయించాడు. తనకు నచ్చిన వాటికి ఎక్కువ సమయం ఇచ్చి, చదువుకు మాత్రం 15 నిమిషాలే ఇవ్వడం గమనార్హం. ఆ చిన్నారి టైమ్ టేబల్ ని వారి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ ఛేయగా, వైరల్ గా మారింది. ఈ పోస్టుకు 12మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. అయితే, ఆ చిన్నారి ఏ ప్రాంతానికి చెందినవాడు అనే విషయం మాత్రం తెలియలేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్