కర్ణాటకలో ప్రధాని టూర్: మాండ్యలో మోడీకి బ్రహ్మరథం

Published : Mar 12, 2023, 03:23 PM ISTUpdated : Mar 12, 2023, 03:39 PM IST
 కర్ణాటకలో  ప్రధాని టూర్: మాండ్యలో  మోడీకి బ్రహ్మరథం

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  కర్ణాటక  రాష్ట్రంలో  పలు అభివృద్ది, సంక్షేమ  కార్యక్రమాల్లో  ఇవాళ పాల్గొన్నారు.   

బెంగుళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  కర్ణాటక రాష్ట్రంలోని  మాండ్యలో ఆదివారంనాడు  పర్యటించారు. మాండ్యలో మోడీ నిర్వహించిన రోడ్ షో కు  ప్రజలు పెద్ద ఎత్తున  స్వాగతం పలికారు.

 

రోడ్డుకు ఇరువైపులా నిలబడి  మోడీకి  స్వాగతం పలికారు  ప్రజలు.  కారుపై నిలబడి  ప్రజలకు అభివారం చేస్తూ  మోడీ  రోడ్ షో లో  ముందుకు సాగారు.  తనకు ఘనంగా  స్వాగతం పలికినందుకు గాను  మాండ్య ప్రజలకు  మోడీ  ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని  మోడీ  రోడ్ షో నిర్వహించే సమయంలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి  పూలు చల్లారు.  తన కారుపై పడిన పూలను  ప్రధాని నరేంద్ర మోడీ  ప్రజలపైకి విసిరారు.

 ప్రజలకు నవ్వుతూ ఆయన అభివాదం  చేశారు. సంప్రదాయరీతిలో  తనకు స్వాగతం పలికిన  జానపద కళాకారులకు  ప్రధాని మోడీ  కారు దిగి అభివాదం  చేశారు.  పాత మైసూరు ప్రాంతంలో  1.8 కి.మీ  రోడ్  షో  సాగింది. ఈ ప్రాంతంలో  బీజేపీని బలోపేతం  చేసేందుకు  ఈ రోడ్  షో  ను ఏర్పాటు  చేశారు.  మాండ్య  జిల్లాలోని మద్దూరు తాలుకా గెజ్జలగెరె కాలనీలో  రూ. 8,480 కోట్ల అంచనా వ్యయంతో  ప్రధాని  శంకుస్థాపన  చేశారు.  

also read:దేశాభివృద్ధి చూసి యువత గర్వపడుతోంది - బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ

బెంగుళూరు-మైసూర్  ఎక్స్ ప్రెస్  వేను  ప్రధాని జాతికి అంకితం  చేయనున్నారు. మైసూరు-కుశాల్ నగర్  నాలుగు లైన్ల  రహదారికి  ప్రధాని  శంకుస్థాపన  చేస్తారు.  రాష్ట్రంలో  సుమారు  రూ. 16 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును  మోడీ  ప్రారంభించనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?