
18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోసులను ఉచితంగా అందించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి అందించిన అనేక బహుమతులలో ఒకటి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా పెద్దలందరికీ ఉచిత ప్రికాషనరీ డోసులను అందించేందుకు 75 రోజుల స్పెషల్ డ్రైవ్‌ను కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రియురాలు మోసం చేసిందని హత్య చేసి.. ప్రియుడు ఆత్మహత్య..
“ 2022 జూలై 15 నుంచి రాబోయే 75 రోజుల పాటు 18 ఏళ్లు పైబడిన పౌరులకు ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వబడుతుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశానికి మన ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అనేక బహుమతులలో ఇది ఒకటి. ఇది ప్రతి పౌరుడి పట్ల ఆయనకున్న శ్రద్ధకు నిదర్శనం.’’ అని జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
కాగా ఈ విషయంలో అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. పెద్దలందరికీ COVID-19 వ్యాక్సిన్‌ల ఉచిత ప్రికాషనరీ డోసులను అందించాలనే ప్రభుత్వ నిర్ణయం భారతదేశ టీకా కవరేజీని మరింత పెంచుతుందని తెలిపారు. ఇది ఆరోగ్యకరమైన దేశాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. “కోవిడ్-19తో పోరాడేందుకు టీకా అనేది సమర్థవంతమైన సాధనం. నేటి క్యాబినెట్ నిర్ణయం భారతదేశం టీకా కవరేజీని మరింత మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన దేశాన్ని సృష్టిస్తుంది ” అని ప్రధాని ట్వీట్ చేశారు.
కదులుతున్న కారులో యువతిపై అత్యాచారయత్నం... తప్పించుకోవడానికి కిందికి దూకిన యువతి.. తీవ్రగాయాలతో....
ఇదిలా ఉండగా.. భారత్ ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ COVID-19 వ్యాక్సిన్‌ల ప్రికాషనరీ డోసులను ఇవ్వడం ప్రారంభించింది. అయితే 18-59 ఏళ్ల మధ్య ఉన్న 77.10 కోట్ల జనాభాలో 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే వీటిని ఇప్పటి వరకు తీసుకున్నారని అధికార లెక్కలు చెబుతున్నాయని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.
పదేళ్ల బాలుడిని మింగిన మొసలి.. అనుమానంతో బంధించి చిత్రహింసలు.. చివరికి నదిలో శవమై తేలిన చిన్నారి...
కాగా ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం కింద 18-59 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులు ప్రభుత్వ టీకా కేంద్రాల్లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. అయితే ప్రికాషనరీ డోసును పొందేందుకు ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లను సౌకర్యాన్ని సందర్శించే వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ల సమర్థతపై కొంతమంది అనుమానాలు సృష్టించారని పేర్కొన్న కేంద్ర మంత్రి.. ప్రతీ ఒక్కరికీ బూస్టర్ డోస్ అవసరం ఉందని.. ఎవరూ దాని కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు.