Protocol row: నాకు స్వాగతం పలకడానికి రావొద్దు: కర్ణాటక సీఎంకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

Published : Aug 26, 2023, 01:07 PM IST
Protocol row: నాకు స్వాగతం పలకడానికి రావొద్దు: కర్ణాటక సీఎంకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 6 గంటలకు బెంగళూరు వచ్చారు. అయితే.. తనను స్వాగతించడానికి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఎయిర్‌పోర్టుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రొటోకాల్ ప్రకారం, ఆయనను స్వాగతించాలి. కానీ, ప్రధాని మోడే వద్దనడంపై కాంగ్రెస్ మండిపడింది. ఇస్రో శాస్త్రవేత్తలను కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు ఆయన ముందు సత్కరించడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకుని చిల్లర రాజకీయం చేశారని ఫైర్ అయింది.  

న్యూఢిల్లీ: సాధారణంగా ప్రధానమంత్రి ఒక రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారంటే.. ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి లేదా.. ఆయన బదులు మరో మంత్రి తప్పకుండా స్వాగతినిస్తారు. అది ప్రొటోకాల్. కానీ, తాజాగా, ప్రధాని మోడీ స్వయంగా ఈ ప్రొటోకాల్‌కు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. తానే స్వయంగా తనను ఆహ్వానించడానికి సీఎం రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

బ్రిక్స్ సమావేశాల కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోడీ ఈ రోజు ఉదయం 6 గంటలకు నేరుగా బెంగళూరుకు వచ్చారు. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన తరుణంలో ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ కలవడానికి బెంగళూరు వచ్చారు. అయితే.. తనను స్వాగతించడానికి సీఎం సిద్ధరామయ్య లేదా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు ఎయిర్‌పోర్టుకు రావొద్దని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోడీ ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఫైర్ అయింది.

‘తన ముందే కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను సత్కరించడం ఇష్టం లేకే ప్రధాని వీరిద్దరినీ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రొటోకాల్‌కు వ్యతిరేకం. ఇది చిల్లర రాజకీయం తప్ప మరేమీ కాదు’ అని ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ లీడర్ జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. చంద్రయాన్ 1 సక్సెస్ అయినప్పుడు అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గుజరాత్ పర్యటించినప్పుడు సీఎంగా ఉన్న ఈ మోడీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సందర్శించిన సంగతి మరిచిపోయారా? అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. 

Also Read: Chandrayaan-3: ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ఇస్రో శాస్త్రవేత్తల సమక్షంలో మోదీ భావోద్వేగం..

ఈ వివాదంపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. తాను బెంగళూరుకు ఏ సమయానికి చేరుకుంటానో తనకే తెలియదని, అందుకే సీఎం, డిప్యూటీ సీఎం, గవర్నర్‌లను ఇబ్బంది పెట్టవద్దనే స్వాగతించడానికి రావొద్దని విజ్ఞప్తి చేశానని ప్రధాని మోడీ తెలిపారు. 

కాగా, తాము స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని, తాను లేదా సీఎం సిద్ధరామయ్య వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. కానీ, తమకు అధికారికంగా సమాచారం రావడంతో వాటిని గౌరవించామని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్