చంద్రయాన్-3 : జాబిల్లిపై 8 మీటర్లు కదిలిన ప్రజ్ఞాన్ రోవర్.. ఇంకా ఏం చేసిందంటే ?

Published : Aug 26, 2023, 12:07 PM IST
చంద్రయాన్-3 : జాబిల్లిపై 8 మీటర్లు కదిలిన ప్రజ్ఞాన్ రోవర్.. ఇంకా ఏం చేసిందంటే ?

సారాంశం

జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన తరువాత అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. చంద్రుడిపై ఇప్పటి వరకు 8 మీటర్లు ప్రయాణించింది. అలాగే తన పేలోడ్ లను కూడా ఆన్ చేసుకుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.

చంద్రయాన్- 3 లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై బుధవారం సాయత్రం సాఫ్ల్ ల్యాండ్ అయ్యింది. అదే రోజు రాత్రి 10.00 దాటిన తరువాత అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రోవర్ జాబిల్లిపై అడుగుపెట్టిన తరువాత ఎంత దూరం ప్రయాణించింది ? అది ఏం చేసిందనే విషయంలో క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయంలో ఇస్రో స్పష్టత ఇచ్చింది. ఎక్స్ (ట్విట్టర్)లోని తన అధికారిక పేజీలో ఈ విషయాన్ని పోస్టు చేసింది.

ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చిన  తరువాత ఇప్పటి వరకు 8 మీటర్లు కదలింది. తన చక్రాలో ఓ వైపు భారత జాతీయ చిహ్నం, మరో వైపు ఇస్రో లోగోను ముద్రిస్తు ముందుకు కదిలింది. అలాగే తన పేలోడ్ లను కూడా ఆన్ చేసుకుంది. ‘‘ప్లాన్డ్ రోవర్ కదలికలన్నింటినీ పరిశీలించాం. రోవర్ సుమారు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా దాటింది. రోవర్ పేలోడ్స్ ఎల్ఐబీఎస్ (లేజర్-ప్రేరిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్), ఏపీఎక్స్ ఎస్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ ఆన్ అయ్యాయి. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ లోని అన్ని పేలోడ్లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి.’’ అని ఇస్రో పేర్కొంది. 

కాగా.. విక్రమ్ ల్యాండర్ లోని ర్యాంప్ ప్రజ్ఞాన్ కు ఎలా ఉపయోగపడింది. సోలార్ ప్యానెల్ ఎలా అమర్చారనే వీడియోను కూడా ఇస్రో షేర్ చేసింది. ‘‘ రోవర్ ను దించడానికి రెండు సెగ్మెంట్ల ర్యాంప్ దోహదపడింది. సోలార్ ప్యానెల్ ద్వారా రోవర్ విద్యుత్ ఉత్పత్తి చేయగలిగింది’’ అని పేర్కొంది. 

ప్రజ్ఞాన్ ఇప్పుడు రెండు యాక్టివ్ పేలోడ్స్ తో పనిచేస్తోంది. ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (ఎపిఎక్స్ఎస్) చంద్రుడి ఉపరితలంపై మన అవగాహనను మరింత పెంచడానికి రసాయన కూర్పును పొందనుంది. ఖనిజ సమ్మేళనాన్ని అంచనా వేయనుంది. లేజర్ ప్రేరిత బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ (ఎల్ఐబీఎస్) చంద్రుడి నేల, చంద్రుడి ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న శిలల మూలక కూర్పును నిర్ణయిస్తుంది.

కాగా.. గత నాలుగేళ్లుగా చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్ - 2లోని ఆర్బిటర్ లోని హై రిజల్యూషన్ కలిగిన కెమెరాలు చంద్రుడిపై ఉన్న విక్రమ్ ల్యాండర్ ను ఫొటోలు తీసింది. అందులో విక్రమ్ సూర్యకాంతిలో మెరుస్తూ కనిపిస్తోంది. అయితే ఈ చంద్రయాన్ -3 మిషన్ కాల వ్యవధి మొత్తం ఒక చంద్ర దినం. అంటే మన భూమిపై సుమారు 14 రోజులతో సమానం. ల్యాండర్, రోవర్ లోని బ్యాటరీలు సౌరశక్తి ద్వారా ఛార్జ్ అవుతాయి. సెప్టెంబర్ 6 నుంచి 14 రోజుల పాటు చంద్రుడిపై సూర్యకిరణాలు ఉండవు. కాబట్టి అవి 14 రోజులే పని చేయనున్నాయి. కానీ సెప్టెంబర్ 20 తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంపై మళ్లీ చంద్రోదయం కానుంది. అప్పుడు ల్యాండర్, రోవర్ ను పునరుద్ధరించాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్