బాలికను వేధించాడని.. యువకుడి బెడకు బెల్టు బిగించి, కర్రలతో చితకబాది.. దారుణం...

Published : Sep 22, 2021, 11:21 AM IST
బాలికను వేధించాడని.. యువకుడి బెడకు బెల్టు బిగించి, కర్రలతో చితకబాది.. దారుణం...

సారాంశం

మధ్యప్రదేశ్, రేవా జిల్లా అర్జున్ పుర్ గ్రామంలో ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు చితకబాదారు. యువకుడి మెడకు బెల్టు కట్టి (Belt  Tied), కర్రలతో తీవ్రంగా కొట్టారు. 

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో దారుణం చోటు చేసుకుంది. బాలికను వేధించాడని.. ఓ యువకుడిని అతి క్రూరంగా హింసించారు. ఈ వీడియో వైరల్(Viral Video)కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఘటనకు కారణమైన ముగ్గురి మీద కేసు నమోదు చేశారు. 

ఈ ఘటన వివరాల్లోకి వెడితే... మధ్యప్రదేశ్, రేవా జిల్లా అర్జున్ పుర్ గ్రామంలో ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు చితకబాదారు. యువకుడి మెడకు బెల్టు కట్టి (Belt  Tied), కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు బల్దావ్ జాదవ్ (28) దెబ్బలకు తాళలేక గావుకేకలు పెట్టాడు. అయినా వారు వినిపించుకోలేదు. అంతేకాదు ఈ ఘటనను మొత్తం వీడియో కూడా తీశారు. 

స్లీపర్ బస్సులో బాలికపై అత్యాచారం.. అడ్డుకోబోయిన తల్లిని... !

బల్దావ్ జాదవ్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. అతనుగ్రామంలోని ఓ బాలికను వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, ఆగ్రహంలో యువకుడిమీద దాడి చేసినట్లు సమాచారం. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎనిమిది పది రోజుల క్రిందటిదని తెలిపిన పోలీసులు, దాడిచేసిన ముగ్గురిమీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?