ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్.. పార్ట్ టైంగా చైన్ స్నాచింగులు చేస్తూ....

Published : Sep 22, 2021, 12:09 PM IST
ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్.. పార్ట్ టైంగా చైన్ స్నాచింగులు చేస్తూ....

సారాంశం

ఢిల్లీ నగరంలో చైన్ స్నాచింగ్,  మొబైల్ ఫోన్ల స్నాచింగ్ లకు  పాల్పడుతున్న హరీష్ అనే నిందితుడిని దక్షిణ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్ గా పని చేస్తున్న హరీష్ ని వలపన్ని నెబ్ సరాయ్ సమీపంలోని సిటీ ఫారెస్ట్ గేటు వద్ద పోలీసులు పట్టుకున్నారు.

న్యూ ఢిల్లీ : ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ (Chef)గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. చైన్ స్నాచింగ్ (Chain Snatching) లు చేసిన ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో వెలుగుచూసింది.  

ఢిల్లీ నగరంలో చైన్ స్నాచింగ్,  మొబైల్ ఫోన్ల స్నాచింగ్ లకు  పాల్పడుతున్న హరీష్ అనే నిందితుడిని దక్షిణ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్ గా పని చేస్తున్న హరీష్ ని వలపన్ని నెబ్ సరాయ్ సమీపంలోని సిటీ ఫారెస్ట్ గేటు వద్ద పోలీసులు పట్టుకున్నారు.

 నిందితుడు హరీష్ తుపాకీతో కాల్పులు జరిపేందుకు యత్నించగా అతన్ని పోలీసులు పట్టుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్ గా పనిచేస్తున్న హరీష్ చైన్ స్నాచింగ్ లకు పాల్పడటంతో పోలీసులు షాక్ కు గురయ్యాడు. 

నిందితుడు నెబ్ సరాయ్ ప్రాంతంలో ఓ స్వర్ణకారుడికి మూడు బంగారు గొలుసులను విక్రయించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడి నుంచి నాటు తుపాకీతో పాటు లైవ్ కాట్రిడ్జులు, నాలుగు మొబైల్ ఫోన్లు, నాలుగు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word