Modi US Visit:అమెరికాకు చేరుకొన్న మోడీ, ఎన్ఆర్ఐల స్వాగతం, బిజీ బిజీ

Published : Sep 23, 2021, 10:52 AM IST
Modi US Visit:అమెరికాకు చేరుకొన్న మోడీ, ఎన్ఆర్ఐల స్వాగతం, బిజీ బిజీ

సారాంశం

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు చేరుకొన్నారు. మూడు రోజుల పాటు ఆయన అమెరికాలోనే గడుపుతారు.  అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ తో మోడీ భేటీ అవుతారు. క్వాడ్ సమావేశంలో కూడ మోడీ పాల్గొంటారు. అమెరికాకు చేరుకొన్న మోడీకి ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతం పలికారు.

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi) అమెరికాకు చేరుకొన్నారు. మూడు రోజుల పాటు మోడీ అమెరికాలోనే పర్యటించనున్నారు. (Narnedra modi us visit) పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు

బుధవారం నాడు మధ్యాహ్నం మోడీ న్యూఢిల్లీ నుండి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో  భారత ప్రధాని మోడీకి భారతీయులు(indians) ఘనంగా స్వాగతం పలికారు. అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్‌‌ఐలు(nri)  భారతీయ జాతీయపతాకాలతో స్వాగతం పలికారు.

also read:Narendra Modi US Visit: మూడు రోజులు అమెరికాలోనే, బైడెన్‌తో భేటీ కానున్న మోడీ

అమెరికాతో ధ్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నరేంద్రమోడీ అమెరికా టూర్ సాగుతుంది. క్వాడ్ (quad) సదస్సులో మోడీ పాల్గొంటారు.  క్వాడ్ సదస్సులో పాల్గొనే ఆయా దేశాల అధినేతలతో కూడ ఆయన సమావేశం కానున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden), అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ ( kamala harris) తో నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఇవాళ కమలా హరీస్ తో మోడీ భేటీ కానున్నారు.రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్గానిస్తాన్ పరిణామాలతో పాటు పలు అంశాలపై నరేంద్ర మోడీ చర్చించనున్నారు. ఈ నెల 26న మోడీ స్వదేశానికి తిరిగి వస్తారు.

వాష్టింగన్ లో ప్రధాన అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో మోడీ భేటీ కానున్నారు. ఇండియాలలో పెట్టుబడులు పెట్టాలని మోడీ అమెరికన్ వ్యాపారస్తులను కోరనున్నారు. ఆపిల్ సీఈఓ టిమ్ కమక్ తదితరులతో మోడీ భేటీ కానున్నారు.ఈ నెల 24వ తేదీన వైట్‌హౌస్ లో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ కానున్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భారతదేశం యూఎస్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ను మరింత విస్తరించడం వంటి వాటిపై చర్చించనున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !