పాత కక్షలతో వృద్ధురాలిమీద కత్తులతో దాడి, హత్య.. తలనరికి వెంటతీసుకెళ్లి... !

Published : Sep 23, 2021, 09:53 AM IST
పాత కక్షలతో వృద్ధురాలిమీద కత్తులతో దాడి, హత్య.. తలనరికి వెంటతీసుకెళ్లి... !

సారాంశం

ఆ హత్య కేసులో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో శెట్టినాయకన్ పట్టీకి చెందిన నిర్మలా దేవి (65) అనే వృద్ధురాలు ఉన్నారు. పశుపతి పాండ్యన్ గుర్తించేందుకు సహకరించిందని, హంతకులకు తన ఇంట ఆశ్రయమిచ్చిందని ప్రత్యర్థులు ఆమె మీద అనుమానం పెంచుకున్నారు.

చెన్నై : తమిళనాడులోని దిండుగల్ సమీపం శెట్టినాయకన్ పట్టీలో పాతకక్షల నేపథ్యంలో ఓ వృద్ధురాలు దారుణహత్యకు (Murder)గురైంది. ఆ వృద్ధురాలు మృతి చెందిన తర్వాత హంతకులు తలను నరికి (Head Slit) చేతపట్టుకుని పారిపోయారు. పదేళ్లకు ముందు ఆ ప్రాంతంలోనే దేవేంద్రకుల వెల్లాలర్ సంఘం నాయకుడు పశుపతి పాండ్యన్ కు కొంతమంది వేటకొడవళ్లతో దాడి జరిపి హత్య చేశారు. 

ఆ హత్య కేసులో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో శెట్టినాయకన్ పట్టీకి చెందిన నిర్మలా దేవి (65) అనే వృద్ధురాలు ఉన్నారు. పశుపతి పాండ్యన్ గుర్తించేందుకు సహకరించిందని, హంతకులకు తన ఇంట ఆశ్రయమిచ్చిందని ప్రత్యర్థులు ఆమె మీద అనుమానం పెంచుకున్నారు. ఆమెను చంపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపత్యంలో బుధవారం ఉదయం నిర్మలాదేవి అరివుతిరుక్కోవిల్ సమీపంలో నడిచి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మీద కత్తులతో దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. 

ప్రేమించుకున్నారని.. మెడలో టైర్లువేసి.. బలవంతంగా..!

హంతకులు నిర్మలాదేవి మృతి చెందినట్లు నిర్థారించుకున్న తరువాత ఆమె తలను కత్తితో నరికి తమ వెంటన తీసుకుని పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకుని తాడికొంబు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిర్మలాదేవి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. హంతకుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport