India corona: 24 గంటల్లో 31,923 కొత్త కేసులు, కేరళలోనే 19,675 కేసులు

Published : Sep 23, 2021, 09:57 AM ISTUpdated : Sep 23, 2021, 10:06 AM IST
India corona: 24 గంటల్లో 31,923 కొత్త కేసులు, కేరళలోనే 19,675 కేసులు

సారాంశం

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే నిన్న  31,923 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 282 మంది కరోనాతో మరణించారు.దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.46 లక్షలకు చేరుకొంది.  

న్యూఢిల్లీ: ఇండియాలో(india) గత 24 గంటల్లో 31,923 కొత్త కరోనా(corona cases) కేసులు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలోనే  నిన్న ఒక్క రోజే 19,675 కొత్త కేసులు నమోదయ్యాయి.దేశ వ్యాప్తంగా ఇండియాలో 3.01 లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నాయని ఐసీఎంఆర్(icmr) ప్రకటించింది. కేరళ (kerala)రాష్ట్రంలో 1.61 లక్షల యాక్టివ్ కేసులున్నాయని ఐసీఎంఆర్  ప్రకటించింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 282 మంది కరోనాతో మరణించారు.దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.46 లక్షలకు చేరుకొంది.

గత 24 గంటల్లో 15,27,443 మందికి కరోనా పరీక్సలు నిర్వహించారు.  అంతకు ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు 18 శాతం పెరిగాయి. ఇండియాలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 3.35 కోట్లకు చేరుకొంది.  కరోనా నుండి ఇప్పటివరకు 3.28 కోట్ల మంది కోలుకొన్నారు.నిన్న ఒక్క రోజే కరోనా నుండి 31 వేల మంది కోలుకొన్నారు.  కరోనా రోగుల రికవరీ రేటు 97.77 శాతంగా నమోదైంది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 0.90 శాతానికి తగ్గింది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !