up assembly elections 2022: వాగ్దానాలివ్వ‌డమే కాదు.. బ్రేక్ చేయ‌డంలోనూ మోడీ దిట్ట: టీఎంసీ సెటైర్లు

By Mahesh RajamoniFirst Published Dec 19, 2021, 4:31 PM IST
Highlights

up assembly elections 2022:  వ‌చ్చే ఏడాది జ‌రిగే ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో దేశంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ వాగ్దానాలు ఇవ్వ‌డంలోనే కాదు.. వాటిని బ్రేక్ చేయ‌డంలోనూ దిట్ట అంటూ టీఎంసీ సెటైర్లు వేసింది. 
 

up assembly elections 2022: ఎలాంటి ఎన్నిక‌లైనా స‌రే వాటికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది రాజ‌కీయ కాకా మాములుగా ఉండ‌దు. ప్ర‌స్తుతం ఉత్త‌ర‌భార‌తంలోనూ ఇదే జ‌రుగుతోంది. వచ్చే ఏడాది 2022 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. మాట‌ల యుద్ధం కొన‌సాగిస్తుండ‌టంతో రాజ‌కీయాలు హీటెక్కాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ వాగ్దానాలు ఇవ్వ‌డంలోనే కాదు.. వాటిని బ్రేక్ చేయ‌డంలోనూ దిట్ట అంటూ తృణమూల్ కాంగ్రెస్ మోడీపై సెటైర్లు వేసింది. ఎలాగైనా త్వ‌ర‌లో జ‌రిగే అసెబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించి.. అధికారం పీఠం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. దీనికి అనుగుణంగా ఎన్నిక‌ల ప్ర‌చారం సాగిస్తోంది.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేస్తున్న వాగ్దానాల పై తృణమూల్ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. వాగ్దానాలు ఇవ్వడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చాలా గొప్పవారని, ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడంలో ఆయన మరింత గొప్పవారంటూ టీఎంసీ నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ విమ‌ర్శించారు.

Also Read: UP +Yogi..upyogi కాదు.. యూస్ లెస్: బీజేపీపై నిప్పులు చేరిన అఖిలేష్ యాదవ్

ప్ర‌స్తుతం బెంగాల్ లోని ప‌లు ప్రాంతాల్లో న‌గ‌ర పాల‌క ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కోల్‌క‌తా నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఎంసీ ఎంపీ, రాజ్య‌స‌భ స‌భ్యుడు  డెరెక్ ఒబ్రెయిన్ ఓటు వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న  మీడియాతో మాట్లాడుతూ, ‘‘ప్రధాన మంత్రి ఎక్కడకెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లొచ్చు. వాగ్దానాలు ఇవ్వడం, వాటిని అమలు చేయడం రెండు వేర్వేరు అంశాలు. ప్ర‌ధాని మోడీ  వాగ్దానాలు చేయడంలో చాలా గొప్పవారు, వాటిని తుంగలో తొక్కడంలో మరింత గొప్పవారు’’ అని అన్నారు. దీపావళి తర్వాత, క్రిస్ట్‌మస్‌కి ఓ వారం ముందు తాము ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నామన్నారు. గడచిన ప‌దేండ్ల‌లో తాము చేసిన అభివృద్ధి వల్ల తమను ప్రజలు ఆశీర్వదిస్తారని వెల్ల‌డించారు. తాము అత్యంత భారీ ఆధిక్యంతో గెలుస్తామని ధీమా వ్య‌క్తం చేశారు.  కాగా, ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయాల్లో ఎంతో కీల‌కంగా ఉండే కోల్‌కతా నగర పాలక సంస్థ ఎన్నికలు కొన్ని చెదురుమదురు సంఘటనల త‌ర్వాత ఆదివారం ఉద‌యం ప్రారంభ‌మ‌య్యాయి. 

Also Read: engineering courses: తెలుగులోనూ ఇంజినీరింగ్ కోర్సులు చ‌ద‌వ‌చ్చు.. !

కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని  144 వార్డుల్లో  ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి.  రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాత్కాలిక డేటా ప్రకారం పోలింగ్ ప్రారంభమైన మూడు గంటల్లో కేవలం 9.14 శాతం  పోలింగ్ మాత్రమే నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.17 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ప‌లు చోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి మొత్తం 72 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కోల్‌కతాలోని సీల్దా, ఖన్నా ప్రాంతాల్లో రెండు నాటు బాంబులు విసిరిన సంఘటనల‌కు సంబంధించి నిందితుల‌ను పోలీసులు గుర్తించారు. వారిలో ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. మిగ‌తా వారిని త్వ‌ర‌లోనే అరెస్టు చేస్తామ‌ని తెలిపారు. వారిపై త‌గిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. 

Also Read: Rajnath Singh: జాతీయ భ‌ద్ర‌త‌కే తొలి ప్రాధాన్యం.. భార‌త్‌లోనే ఆయుధాల తయారీ..

click me!