
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులను కాకుండే.. సహాయ మంత్రులను కూడా ఆహ్వానించారు. ఈ ఏడాది చివరల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. కేంద్ర కేబినెట్‌లో మార్పులు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్‌లో మార్పులు-చేర్పులు జరిగిన పక్షంలో మిత్రపక్షాలతో పాటు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన నేతలకు కేబినెట్ విస్తరణలో చోటు కల్పిస్తారనే ప్రచారం సాగుతుంది.
ఈ కేబినెట్ సమావేశంలో.. పార్లమెంట్ వర్షకాల సమావేశాల గురించి చర్చించే అవకాశం ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్‌తో పాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే తన అమెరికా పర్యటన విజయవంతం కావడంపై మోదీ.. ఈ సమావేశంలో తన ఆలోచనలను పంచుకోనున్నారు.