జులై 17-18 తేదీల్లో బెంగళూరులో ప్ర‌తిప‌క్షాల సమావేశం..

Published : Jul 03, 2023, 04:16 PM IST
జులై 17-18 తేదీల్లో బెంగళూరులో ప్ర‌తిప‌క్షాల సమావేశం..

సారాంశం

Bengaluru: బెంగళూరులో జూలై 13, 14 తేదీల్లో జ‌ర‌గాల్సిన‌ విపక్షాల మీటింగ్ వాయిదా ప‌డింది. ఈ క్ర‌మంలోనే విపక్ష పార్టీల స‌మావేశం కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన ప్రకారం జూలై 17,18 తేదీల్లో బెంగళూరులో అఖిలపక్ష సమావేశం జరగనుంది. తొలి సమావేశం 23 జూన్ 2023న పాట్నాలో జరిగింది.  

Next opposition meeting to be held on July 17-18: బెంగళూరులో జూలై 13, 14 తేదీల్లో జ‌ర‌గాల్సిన‌ విపక్షాల మీటింగ్ వాయిదా ప‌డింది. ఈ క్ర‌మంలోనే విపక్ష పార్టీల స‌మావేశం  సమావేశం కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన ప్రకారం జూలై 17,18 తేదీల్లో బెంగళూరులో అఖిలపక్ష సమావేశం జరగనుంది. తొలి సమావేశం 23 జూన్ 2023న పాట్నాలో జరిగింది.

వివ‌రాల్లోకెళ్తే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ నెల 17,18 తేదీల్లో కర్ణాటకలోని బెంగళూరులో విపక్షాల ఉమ్మడి సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ సోమవారం ప్రకటించింది. కొత్త తేదీలను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. "పాట్నాలో విజయవంతమైన విప‌క్షాల‌ అఖిలపక్ష సమావేశం తరువాత మేము తదుపరి సమావేశాన్ని జూలై 17,18 తేదీలలో బెంగళూరులో నిర్వహిస్తాము. ఫాసిస్టు, అప్రజాస్వామిక శక్తులను ఓడించి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సాహసోపేతమైన దార్శనికతను ప్రదర్శించాలన్న ధృడ‌మైన సంకల్పానికి కట్టుబడి ఉన్నామన్నారు.

తొలుత ఈ నెల 13,14 తేదీల్లో బెంగళూరులో సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. అంతకు ముందు ఇది సిమ్లాలో జరగాల్సి ఉంది. అయితే, జూన్ 29న శరద్ పవార్ వేదికను బెంగళూరుకు మార్చినట్లు చెప్పారు. ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ రెబల్ గా మారి షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన మరుసటి రోజే ఈ కొత్త తేదీ రావడం గమనార్హం. ఇదిలావుండగా, యూనిఫాం సివిల్ కోడ్ కోసం ప్రధాని మోడీ గట్టిగా గళమెత్తిన సమయంలో, ఈ అంశంపై సంప్రదింపులను ముమ్మరం చేసే ప్రయత్నాల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా జ‌ర‌గ‌నున్నాయి.

జూన్ 23న బీహార్ లోని పాట్నాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కేంద్రంలోని ప్రస్తుత పాలనపై ఐక్యంగా పోరాడేందుకు నేతలంతా అంగీకరించారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తదుపరి సమావేశంలో ఫ్రంట్ విధివిధానాలను ఖరారు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ సమావేశంలో ఆప్, కాంగ్రెస్ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ను గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఖండించే వరకు కూటమిలో భాగం కావడం చాలా కష్టమని స్పష్టం చేసింది.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !