
Assam Student Raped Case: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నదిలో పడేశారు. మృతదేహం నీటిలో తేలడంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన అసోంలో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ప్రాథమిక విచారణ అనంతరం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతున్నదని తెలిపారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అసోంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కామరూప్ జిల్లాలో చోటుచేసుకుంది. సోనాపూర్ వద్ద దిగరు నదిలో శుక్రవారం ఒక బాలిక మృతదేహం లభ్యమైన క్రమంలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. గత సోమవారం ఫోన్ రీచార్జ్ చేసుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అనంతరం ఆమె మృతదేహం నది సమీపంలో కనిపించింది. దీంతో ఈ ప్రాంతంలోని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ విషయంపై సత్వర చర్యలు తీసుకోవాలని, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలో నిరసనలు చేపట్టారు.
"జూన్ 26న నా చెల్లెలు చేపలు తీసుకురావడానికి మార్కెట్ కు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ఇంటికి తిరిగి రాలేదు. సోనాపూర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు చేశాం. అసలు ఆమెకు ఏమైందో తెలియదు. ఇప్పుడు దిగూరు నదిలో ఆమె మృతదేహం లభ్యమైంది" అని బాధితురాలి అక్క తెలిపినట్టు ఎన్డీటీవీ నివేదించింది.
కనిపించకుండా పోయిన బాలుడు మృతి..
అసోంలోని దర్రాంగ్ జిల్లా ఖరుపెటియాలో కనిపించకుండా పోయిన 13 ఏళ్ల మైనర్ బాలుడు గురువారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. పక్కనే ఉన్న బురదలో బాలుడి మృతదేహం పడి ఉంది. అతని గొంతు కోసినట్టు గుర్తించామని, బురదలో పడేసే ముందు బాలుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. హర్షిత్ జైన్ అనే మైనర్ బాలుడు బుధవారం (జూన్ 28న) ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. అతడిని గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
కాగా, ఈ దారుణ హత్య వెనుక మృతురాలి సోదరుడి హస్తం ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు. వెంటనే ఖరుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి సోదరుడు నమన్ జైన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.