20 మిలియన్ చందాదారులు: మోడీ యూట్యూబ్ రికార్డ్

Published : Dec 26, 2023, 04:03 PM ISTUpdated : Dec 26, 2023, 04:11 PM IST
20 మిలియన్ చందాదారులు: మోడీ యూట్యూబ్ రికార్డ్

సారాంశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  యూట్యూబ్ లో  20 మిలియన్ చందాదారులను సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా ఆయన  చరిత్ర సృష్టించారు.  

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రారంభించిన యూట్యూబ్ చానెల్  20 మిలియన్ల చందాదారులను  సంపాదించుకుంది.  ప్రసిద్ది చెందిన  ప్రపంచ నాయకులలో  నరేంద్ర మోడీ యూట్యూబ్ చానెల్ అగ్రస్థానంలో నిలిచింది.సమకాలీన రాజకీయాల్లో డిజిటల్ ఫ్లాట్ పారమ్ ల ప్రాబల్యం పెరుగుతుంది.ప్రజలతో  నేరుగా మాట్లాడేందుకు  డిజిటల్ మీడియాలను  నేతలు ఉపయోగించుకుంటున్నారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  తన యూట్యూబ్ ని విస్తృతంగా ఉపయోగించడం ద్వారా  తన విధనాలు, కార్యక్రమాలను  సమర్ధవంతంగా  ప్రజలకు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు.  అంతేకాదు ప్రజలతో  ప్రత్యక్షంగా  పలు విషయాలపై  సంభాషిస్తున్నారు. తన పాలనపై  ప్రజల నుండి  సమాచారాన్ని కూడ  మోడీ తెలుసుకుంటున్నారు. 

నరేంద్ర మోడీ యూట్యూబ్ చానెల్  కు గణనీయమైన ఫాలోయింగ్  కలిగి ఉండడం  ప్రాధాన్యత సంతరించుకుంది.  నాయకులు, ప్రభుత్వం, ప్రజల మధ్య అంతరాన్నితగ్గించేందుకు  ఆన్ లైన్  ఫ్లాట్ ఫారాలను  మోడీ ఉపయోగిస్తున్నారు.  

 

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది నాయకులు డిజిటల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. నరేంద్ర మోడీ  డిజిటల్ ఫ్లాట్ పారాలను  విరివిగా ఉపయోగించుకుంటున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్