శ్రీరాముడు నా హృదయంలో ఉన్నాడు.. చూపించాల్సిన అవసరం లేదు - కపిల్ సిబల్

By Sairam Indur  |  First Published Dec 26, 2023, 2:57 PM IST

రాముడు తన హృదయంలో ఉన్నాడని, దానిని ప్రదర్శించాల్సిన అవసరం లేదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. రాముడి లక్షణాలు ఒక్కటీ లేని నాయకులు తామే ప్రస్తుతం రామ మందిరం కట్టిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.


శ్రీరాముడు తన హృదయంలో ఉన్నాడని, దానిని తాను చూపించాల్సిన అవసరం లేదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరవుతారా అనే మీడియా ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాదానం ఇచ్చారు. 

వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ.. ‘‘నా హృదయంలో రాముడు ఉన్నాడు. నేను చూపించాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ నేను పట్టించుకోను కాబట్టి నేను మీకు చెప్పేది నా హృదయం నుండి వచ్చింది. రామ్ నా హృదయంలో ఉన్నాడంటే, రామ్ నా ప్రయాణంలో నాకు మార్గనిర్దేశం చేశాడంటే, నేను ఏదో సరైన పని చేశానని అర్థం’’ అని చెప్పారు.

Latest Videos

ప్రధాని మోడీ నాపై పోటీ చేసినా.. నేను గెలుస్తాను - కాంగ్రెస్ నేత శశిథరూర్ ధీమా..

మొత్తం రామ మందిర నిర్మాణ అంశం ఒక ప్రదర్శన అని కపిల్ సిబల్ అన్నారు. ఎందుకంటే అధికార పార్టీ ప్రవర్తన గానీ, వ్యక్తిత్వం గానీ ఎక్కడా రాముడిని పోలి ఉండదని ఆయన అన్నారు. ‘‘ఈ మొత్తం వ్యవహారం ఒక షో ఆఫ్. వారు (బీజేపీ నాయకులు) రాముడి గురించి మాట్లాడుతున్నారు. కానీ వారి ప్రవర్తన, వారి స్వభావం రాముడికి దగ్గరగా లేవు. నిజాయతీ, సహనం, త్యాగం, ఇతరులను గౌరవించడం రాముడి లక్షణాలు. అయితే ఇవి వారికి విరుద్ధంగా ఉన్నాయి. అలాంటి వారు తామే రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని, రాముడిని కీర్తిస్తున్నారని అంటున్నారు’’ అని అన్నారు.

ప్రతీ ఒక్కరూ రాముడి సిద్ధాంతాలను హృదయంలో ఉంచుకోవాలని, ఆయన సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చాలని కపిల్ సిబల్ ఆకాంక్షించారు. పార్లమెంటులో కొత్తగా ఆమోదించిన క్రిమినల్ బిల్లులపై ఆయన మాట్లాడుతూ.. అవి 'వలసవాద' బిల్లుల కంటే కఠినమైనవని అన్నారు. వాటిలో 'భారతీయత' లేదని చెప్పారు. 

‘‘ఈ బిల్లులు ఆమోదించిన విధానం సరిగా లేదు. మన రాజ్యాంగ సంస్థలు ఈ విధంగా బిల్లులను ఆమోదించి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. లోక్ సభ నుంచి 100 మందిని, రాజ్యసభ నుంచి 46 మందిని సస్పెండ్ చేశారు. ఈ బిల్లుపై కమిటీలో చర్చ జరిగినప్పుడు ప్రముఖ న్యాయవాదులను సంప్రదించాలని కోరాము. కానీ వారు తమ నాయకులతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారు దానిని పార్లమెంటుకు తీసుకువచ్చి ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించారు’’ అని కపిల్ సిబల్ తెలిపారు. 

‘ప్రజాపాలన’లో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తం - మంత్రి శ్రీధర్ బాబు..

ఈ బిల్లుల్లో ఉన్న అంశాలు 90 శాతం ముందే ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న చట్టాలకు అనువదించిన వెర్షన్ మాత్రమే ఇది అని చెప్పారు. ఇవి వలసవాద చట్టాల కంటే కఠినమైనవని, ఇందులో 'భారతీయత' ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు క్రిమినల్ బిల్లలను రాజ్యసభ ఆమోదించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

click me!