పూర్ణా-పార్లీ ప్యాసింజగర్ రైలులో మంగళవారంనాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రైలును నాందేడ్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.
న్యూఢిల్లీ: పూర్ణా-పార్లీ ప్యాసింజర్ రైలుకు(07599) మంగళవారం నాడు మంటలు అంటుకున్నాయి. దీంతో ఈ రైలును నాందేడ్ రైల్వేస్టేషన్ లో రైలును నిలిపివేశారు. అయితే ఈ మంటల కారణంగా రైలులోని ప్రయాణీకులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం.
రైలులో మంటలకు అగ్ని ప్రమాదం కారణంగా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. నాందేడ్ మెయింటెన్స్ యార్డులో ఉంచిన ఖాళీ లగేజీ కమ్ గ్వార్ వ్యాన్ కోచ్ లో మంటలు చెలరేగాయి. అయితే 30 నిమిషాల్లోనే మంటలను పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఇతర కోచ్ లకు ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ తెలిపారు.
నిడదవోలు- ప్యాసింజర్ రైలులో ఈ ఏడాది ఆగస్టు 23న మంటలు చెలరేగాయి. ప్రయాణీకులు రైలు నుండి బయటకు వచ్చారు. సత్యవేడులో రైలును నిలిపివేశారు.
బెంగుళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న రైల్వే స్టేషన్ లో ఈ ఏడాది ఆగస్టు 19న ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయి.ఈ మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తేల్చారు.
ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ఈ ఏడాది జూలై 7న మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి-పగిడిపల్లి వద్ద రైలును నిలిపివేశారు. రైలులోని ఐదు బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి.ఈ ఘటనలో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు.
గూడూరు జంక్షన్ సమీపంలో నవజవీన్ ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు రైలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవజీవన్ ఎక్స్ ప్రస్ రైలు పాంట్రీ బోగీలో మంటలు చెలరేగాయి.దీన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేశారు.ఈ ఘటన 2022 నవంబర్ 18న చోటు చేసుకుంది.