ప్రధాని మోడీ ఒక్క పర్యటనతో భారత్‌లో ప్రత్యక్షంగా లక్ష ఉద్యోగాలు : కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Published : Jun 23, 2023, 04:45 PM IST
ప్రధాని మోడీ ఒక్క పర్యటనతో భారత్‌లో ప్రత్యక్షంగా లక్ష ఉద్యోగాలు : కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

సారాంశం

ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో సెమికండక్టర్ రంగానికి చెందిన మూడు కీలక ప్రకటనలు వెలువడ్డాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మూడు కంపెనీలు భారత్‌లో పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించాయని, వాటి ద్వారా మనదేశంలో ప్రత్యక్షంగా కనీసం 80 వేల నుంచి 1 లక్ష వరకు ఉద్యోగాల సృష్టి జరుగుతాయని, పరోక్షంగా వేలాది ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని వివరించారు.  

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఒక్క పర్యటనతో మన దేశంలో డైరెక్ట్‌గా ఒక లక్ష ఉద్యోగాల సృష్టి జరుగుతుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో సెమికండక్టర్ రంగానికి సంబంధించి మూడు కీలక ప్రకటనలు వెలువడ్డాయని వివరించారు. ఇవి మన దేశంలో కనీసం 80 వేల నుంచి 1 లక్ష ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించగలవని తెలిపారు.  న్యూఢిల్లీలో ఓ విలేకరుల సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. అంతేకాదు, పరోక్షంగా మొత్తం సప్లై చైన్‌లో వేలాది ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తెలిపారు.

‘గడిచిన రెండేళ్లలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ 10 నుంచి 12 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. అమెరికా కంపెనీ మైక్రాన్ మన దేశంలో మెమోరీ చిప్‌లు తయారు చేస్తామని తాజాగా చేసిన ప్రకటన మనకు మరో మైలురాయి. ఈ కార్యక్రమంతో మన దేశంలో కనీసం 80 వేల నుంచి 1 లక్ష ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టి జరుగుతుంది’ అని కేంద్రమంత్రి చంద్రశేఖర్ వివరించారు.

మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్‌లో 2.75 బిలియన్ డాలర్ల విలువైన సెమికండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీన ఏర్పాటు చేస్తుంది. ప్రధాని మోడీతో మైక్రాన్ సీఈవో, ప్రవాస భారతీయ అమెరికన్ పౌరుడు సంజయ్ మెహ్రోత్రా వాషింగ్టన్‌ డీసీలో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

మైక్రాన్‌తోపాటు మరో సెమికండక్టర్ కంపెనీ అప్లైడ్ మెటీరియల్స్ కూడా దాని ప్రణాళికలను వెల్లడించింది. వచ్చే నాలుగేళ్లలో భారత్‌లో 400 మిలియన్ డాలర్లతో ఒక కొల్లాబరేటివ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. మరో సంస్థ లామ్ రీసెర్చ్ కూడా ఇండియాలో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. 60 వేల హైటెక్ ఇంజనీర్లను రూపుదిద్దుతామని తెలిపింది.

Also Read: వైట్ హౌస్లో ప్రధాని మోడీ ప్రసంగం... నాటు నాటు సాంగ్ ప్రస్తావన!

ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉండగా.. సెమికండక్టర్, కృత్రిమ మేధస్సు, క్వాంటమ్, అధునాతన కంప్యూటింగ్ రంగాలకు చెందిన ప్రకటనలు వెలువడ్డాయి. ఇవి రానున్న కాలంలో యువతకు విశేష ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయి. అమెరికా స్టార్టప్‌లతో, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూటషన్లతో అంతర్జాతీయ స్థాయిలో భారత యువత పని చేయడానికి దోహదపడతాయి’ అని కేంద్ర మంత్రి తెలిపారు.

ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మరిన్ని, విశ్వాసమైన సంస్థలు భారత్‌లోకి అడుగు పెట్టనున్నాయని ఆయన వివరించారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu