
మహారాష్ట్ర : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. గురువారం ఓ మహిళ, ఆమె ముగ్గురు పిల్లలు బావిలో శవమై కనిపించారు. ఈ కేసుకు సంబంధించి మృతురాలి భర్తను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానిక కుండలు తయారు చేసే పొలం వద్ద ఉన్న బావిలో మృతదేహాలు కనిపించాయని, అది చూసిన పొలం యజమాని పోలీసులకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. మరణించిన మహిళను కంచన్‌గా గుర్తించారు. ఆమె అక్కడే పని చేస్తుంది.
హెచ్1 బీ వీసా ఉన్న భారతీయులకు శుభవార్త.. ఇకపై రెన్యూవల్, స్టాంపింగ్ అక్కడే...
బుధవారం రాత్రి ఆమెకు, ఆమె భర్త దంపల్‌కు మధ్య వాగ్వాదం జరగడంతో ఇరుగుపొరుగు వారు జోక్యం చేసుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఉదయానికి కంచన్, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలు బావిలో తేలుతూ కనిపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బావిలో నుంచి వెలికి తీసి... పోస్ట్‌మార్టం కోసం పంపించారు. అయితే, వీరి మృతి ఆత్మహత్య? హత్య? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా,
కడపలో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని వేటకొడవళ్లతో నరికి చంపారు దుండగులు. బాధితుడిని శ్రీనివాస్ రెడ్డి గా గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి జిమ్ ముగించుకుని వస్తుండగా వేట కొడవళ్లతో దాడి చేశారు నిందితులు.
బురఖాల్లో బైక్ మీద వచ్చిన నిందితులు శ్రీనివాస్ రెడ్డి మీద వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. కడపలోని సంధ్యా సర్కిల్ ప్రాంతంలో జరిగిన ఈ గొడవ సమాచారం పోలీసులకు అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాస్ రెడ్డిని హుటాహుటిన కడప రిమ్స్ కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు.