కరోనాతో ప్రతి ఒక్కరికీ రూ. 15 వేలు: అసలు వాస్తవం ఇదీ...

By narsimha lode  |  First Published Apr 15, 2020, 3:16 PM IST
కరోనా సమయంలో ప్రతి భారతీయుడికి ప్రధాని మోడీ రూ. 15 వేలు ఇస్తున్నట్టుగా ఓ నకిలీ మేసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

న్యూఢిల్లీ:  కరోనా సమయంలో ప్రతి భారతీయుడికి ప్రధాని మోడీ రూ. 15 వేలు ఇస్తున్నట్టుగా ఓ నకిలీ మేసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

 

दावा : कठिन परिस्तिथियों के बीच, पीएम हर भारतीय को 15 हजार रुपय की मदद दे रहे हैं जिसे प्राप्त करने के लिए दिए गए लिंक पर क्लिक करके फॉर्म भरना होगा।

तथ्य :यह दावा बिलकुल झूठ है,व दिया गया लिंक फर्जी है|

कृप्या अफवाहों और जालसाज़ों से दूर रहें| pic.twitter.com/BrgEJYeUCW

— PIB Fact Check (@PIBFactCheck)

కరోనా విషయంలో ప్రజలకు ఉపయోగపడే సమాచారంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే సమాచారం కూడ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ రూ. 15 వేలు ఇవ్వాలని మోడీ నిర్ణయం తీసుకొన్నారని ఓ మేసేజ్ చక్కర్లు కొడుతోంది.

ఈ లింకుపై క్లిక్ చేసి ధరఖాస్తును నింపాలని ఓ మేసేజ్ నెటిజన్లకు ఊరిస్తోంది. అయితే ఇది ఫేక్ మేసేజ్ అని ప్రెస్ ఇన్పర్మేషన్ బ్యూరో(పీఐబీ) తేల్చి చెప్పింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పీఐబీ ప్రకటించింది.

also read:కరోనా ఎఫెక్ట్: తుపాకీతో కాల్చుకొని ఆత్మాహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్

ఈ రకమైన ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకొంటుంది.
click me!