ఎమ్మెల్యేకి కరోనా... స్వీయ నిర్భందంలోకి గుజరాత్ సీఎం

By telugu news team  |  First Published Apr 15, 2020, 2:26 PM IST
గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలాకు కోవిడ్-19 సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 
 

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వియ నిర్భందంలోకి వెళ్లిపోయారు. కరోనా సోకిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవడంతో.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ముఖ్యమంత్రి స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు.

గుజరాత్‌లోని ఓ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ రావడంతో... సీఎం కూడా క్వారంటైన్ చేసుకున్నారు. కొందరు మంత్రులు కూడా స్వయంగా క్వారంటైన్ అయినట్లు తెలిసింది. చిత్రమేంటంటే... ఆ ఎమ్మెల్యే... కరోనా లక్షణాలు ఉండి కూడా... గుజరాత్ ముఖ్యమంత్రినీ, ఇతర మంత్రుల్ని కలిశారు. 

అలా వారిని కలిసిన కొన్ని గంటల్లోనే ఆ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు ఆయన ద్వారా ఎవరెవరికి కరోనా సోకిందో అన్న టెన్షన్ మొదలైంది.

గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలాకు కోవిడ్-19 సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 

అయితే, కరోనా నిర్దారణ కావడానికి ఆరు గంటల ముందే ఆయన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి.. సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజాను గాంధీనగర్‌లోని సెక్రటేరియల్‌లో కలిశారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమై.. అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 

రాత్రి 8 గంటల సమయంలో ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వారంతా స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు.
click me!