
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియకు వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలపై ఈ సమావేశంలో దృష్టి సారించారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొందమంది కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ (రిటైర్డ్) వికె సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతీయుల తరలింపు ప్రక్రియను సమన్వయం చేయడానికి, విద్యార్థులకు సహాయం చేయడానికి వీరు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రొమేనియా, హంగేరికి వెళ్లనున్నట్టుగా పేర్కొన్నాయి.