ముగ్గురు సీఎన్‌జీ పంప్ ఉద్యోగుల దారుణ హత్య.. పదునైన ఆయుధాలతో దాడిచేసిన దుండగులు

Published : Feb 28, 2022, 11:12 AM IST
ముగ్గురు సీఎన్‌జీ పంప్ ఉద్యోగుల దారుణ హత్య.. పదునైన ఆయుధాలతో దాడిచేసిన దుండగులు

సారాంశం

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని ఓ సీఎన్‌జీ పంప్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగుల దారుణ హత్యకు గురయ్యారు. సెక్టార్-31లో  Delhi-Jaipur national highwayపై ఉన్న సీఎన్‌జీ పంప్‌‌‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులను కొందరు వ్యక్తలు నరికి చంపారని పోలీసులు తెలిపారు. 

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని ఓ సీఎన్‌జీ పంప్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగుల దారుణ హత్యకు గురయ్యారు. సెక్టార్-31లో  Delhi-Jaipur national highwayపై ఉన్న సీఎన్‌జీ పంప్‌‌‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులను కొందరు వ్యక్తలు నరికి చంపారని పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు ఈ నేరం జరిగిందని చెప్పారు. నిందితులు పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడినట్టుగా తెలిపారు. మృతులను భూపేంద్ర, పుష్పేంద్ర, నరేష్‌లుగా గుర్తించామని.. వీరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు మేనేజర్ ఉన్నట్టుగా చెప్పారు.

ఈ నేరానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తరలించినట్టుగా చెప్పారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాలు ఫుటేజీని పరిశీలిస్తున్నాం. ఘటన స్థలాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం కూడా పరిశీలించింది. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది. పోలీసు కమిషనర్ కళా రామచంద్రన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగతనమే ఈ నేరానికి కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇతర కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

‘నాకు తెల్లవారుజామున ఫోన్ కాల్‌ రావడంతో మేల్కొన్నాను. వెంటనే నేను సీఎన్‌జీ పంప్‌కు చేరుకున్నాను. నా సోదరుడు భూపేంద్ర చనిపోయి ఉన్నాడు. నా సోదరుడు ఇక్కడ పంప్ ఆపరేటర్‌గా ఉన్నాడు’ అని ధర్మేంద్ర పిటిఐకి చెప్పారు. తన సోదరుడిని ఎవరు చంపారనేది స్పష్టంగా తెలియరాలేదని ఆయన అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌