'భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహం విడదీయలేనిది' : ప్రధాని మోడీ పారిస్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

By Rajesh Karampoori  |  First Published Jul 14, 2023, 3:27 AM IST

PM Modi France Visit: ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయనీ, ప్రతి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని, అందరూ భారత్ వైపు ఆశగా చూస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహం విడదీయలేనిదని, ఈ సంబంధం చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. 


PM Modi France Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో మోదీకి ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మోదీ పలు అంశాలపై అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చర్చలు జరుపనున్నారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. 

ఈ సందర్భంగా పారిస్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ రోజు భారతదేశం తన కలలను నెరవేరుస్తోందని అన్నారు. భారత్ పాత్ర చాలా వేగంగా మారుతోంది. భారతదేశ ప్రయత్నాలు, అనుభవం ప్రపంచానికి సహాయకరంగా ఉన్నాయని తెలిపారు. భారతదేశం యొక్క శక్తిని ప్రపంచం అర్థం చేసుకుంటోందనీ, ప్రజాస్వామ్యానికి భిన్నత్వం అతిపెద్ద బలమని ప్రధాని మోదీ అన్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహం విడదీయలేనిదని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం,ఫ్రాన్స్ మధ్య సంబంధం చారిత్రాత్మకమైనదనీ, ఇండో-ఫ్రెంచ్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు.

Latest Videos

ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 

  • పారిస్‌లో భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మనం ఎక్కడికి వెళ్లినా, మనం భారతీయులం మినీ ఇండియాను సృష్టిస్తామని అన్నారు. దేశానికి దూరంగా భారత్‌ మాతాకీ జై అనే నినాదం వినిపిస్తే.. తాను ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుందని ప్రధాని అన్నారు.
  • ప్రపంచం కొత్త ప్రపంచం వైపు పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ పాత్ర చాలా వేగంగా మారుతోంది. మొత్తం G-20 గ్రూప్ భారతదేశ సామర్థ్యాన్ని పరిశీలిస్తోంది. భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయి. ప్రతి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. 
  • ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలనకు భారత్‌ చేస్తున్న కృషిని ప్రపంచదేశాలు చూస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యానికి ప్రాధాన్యత పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం విడదీయలేనిదనీ, సవాళ్లను ఇరు దేశాలు కలిసి ఎదుర్కొంటున్నాయని అన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య అనుబంధం, పరస్పర విశ్వాసం ఈ భాగస్వామ్యానికి బలమైన పునాదని పేర్కొన్నారు.
  • భారతదేశం భిన్నత్వం కలిగిన దేశమని, భారతదేశంలో 100 కంటే ఎక్కువ భాషలు ఉన్నాయనీ, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష భారతదేశం నుండి వచ్చింది. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాష తమిళమని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
  • నేడు భారతదేశం తన కలలను నెరవేరుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ 10 ఏళ్లలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారతదేశం ముందుకు సాగితేనే ప్రపంచ ప్రగతి జరుగుతుందన్నారు. 42 కోట్ల మంది ప్రజలను దారిద్య్రరేఖ నుంచి బయటికి తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు.
  • ఈ సందర్భంగా ప్రధాని తన వ్యక్తిగత అనుభావాన్ని కూడా పంచుకున్నారు. ఫ్రాన్స్‌తో తన అనుబంధం చాలా పాతదని, దానిని ఎప్పటికీ మర్చిపోలేనని ప్రధాని మోదీ అన్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫ్రెంచ్ కల్చరల్ సెంటర్‌ను ప్రారంభించగా.. అందులో తాను మొదటి సభ్యుడుగా చేరాననీ,  ఈరోజు అదే కేంద్రంలోని తాను మాట్లాడుతున్ననని తెలిపారు.
  • భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ.. శరీరంలోని ప్రతి కణం దేశప్రజలకు అంకితం అని అన్నారు. ప్రతి క్షణం దేశానికే అంకితం. భారతదేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే పనిలో బిజీగా ఉన్నామని చెప్పారు. మార్సెయిల్‌లో కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోదీ తెలిపారు.
  • దిగ్గజ ఫ్రెంచ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కిలియన్ ఎంబాప్పే గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఫ్రాన్స్‌లో తన అభిమానుల కంటే ఎక్కువ మంది మద్దతుదారులు భారతదేశంలో ఉన్నారని ఆయన అన్నారు. గత ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని చూసిందని అన్నారు. 
  • ఫ్రాన్స్‌లో భారత్‌కు చెందిన యూపీఐ వినియోగానికి సంబంధించి కూడా ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ తెలిపారు. రానున్న రోజుల్లో ఈఫిల్ టవర్ నుంచి దీన్ని ప్రారంభించనున్నారు. రానున్న 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు.
  •  చంద్రయాన్-3 ప్రయోగం గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతదేశంలో చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన రివర్స్ కౌంటింగ్ ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. కొన్ని గంటల్లో చారిత్రాత్మక ప్రయోగం భారతదేశంలోని శ్రీ హరికోట నుండి జరగబోతోందని తెలిపారు.
  • ఫ్రాన్స్‌లో మాస్టర్స్ చదివే భారతీయ విద్యార్థులకు 5 సంవత్సరాల దీర్ఘకాలిక పోస్ట్ స్టడీ వీసా ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.
click me!