కాశ్మీర్ లో ముగ్గురు స్థానికేతరులపై ఉగ్రవాదులు కాల్పులు

By Rajesh Karampoori  |  First Published Jul 14, 2023, 1:03 AM IST

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో స్థానికేతర కార్మికులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని గగ్రాన్ ప్రాంతంలో సాయంత్రం ముగ్గురు స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, వారు గాయపడ్డారని అధికారులు తెలిపారు. 


జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అందుకున్న వార్తల ప్రకారం..  ముగ్గురు స్థానికేతర కూలీలపై కాల్పులు జరిగాయి. గాయపడిన వారందరినీ శ్రీనగర్‌కు తరలించారు. గాయపడిన ముగ్గురి పేర్లు అన్వాల్ థోకర్, హీర్‌లాల్, పింటూ. ఈ ఉగ్రదాడికి టిఆర్‌ఎఫ్ సంస్థ బాధ్యత వహించింది. 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అంటే TRF అనేది లష్కరే తోయిబా యొక్క ప్రాక్సీ సంస్థ. ఈ ఏడాది ప్రారంభంలో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ టిఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. యుఎపిఎ నిబంధనల ప్రకారం టిఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు, ప్రభుత్వం దానిని నిషేధించింది.

ఈ దాడిలో గాయపడిన కూలీలందరూ బీహార్ రాష్ట్రానికి చెందిన వారు. సాయంత్రం 8:45 గంటల సమయంలో.. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో స్థానికేతరులు అద్దెకు తీసుకున్న ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ముగ్గురు బయటి కార్మికులను గాయపరిచారు, ఈ ఇల్లు గగ్రాన్‌లో నివసిస్తున్న స్థానిక న్యాయవాది ఇర్షాద్ హుస్సేన్ సోఫీకి చెందినది. గాయపడిన పరిస్థితిలో, కార్మికులను సమీపంలోని జిల్లా ఆసుపత్రి షోపియాన్‌కు తరలించారు. అక్కడి నుండి ప్రథమ చికిత్స తర్వాత వారిని SMHS శ్రీనగర్‌కు పంపారు.

Latest Videos

click me!