ఢిల్లీలో యమునా వరదపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఢిల్లీపైనా, ఉచితంగా సౌకర్యాలు కల్పించాలన్న ప్రభుత్వ పథకాలపైనా ఆయన ప్రశ్నలు సంధించారు.
యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతోంది. ఇప్పటికే ఐటీఓ, ఎర్ర కోట, ఢిల్లీ సచివాలయం జలమయమయ్యాయి. రాజధాని వాసుల జీవనం అస్థవ్యస్థంగా మారింది. ఈ క్రమంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ విపత్తుకు ఆప్ ప్రభుత్వమే కారణమని బీజేపీ నేత గౌతం గంభీర్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం విపత్తు నిర్వహణలోపం ఉందనీ, సన్నద్ధత లోపించిందని ఆయన ఆరోపించారు. యమునా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో వరద పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీలో వరదల కారణంగా కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీవాసులను మేల్కోండి అంటూ.. ట్వీట్ చేశారు.
తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. "ఢిల్లీ వాసులారా మేల్కొకొండి..ఢిల్లీ మురికి కాల్వలాగా మారింది. ఏదీ ఉచితంగా రాదు. ప్రతిదానికి ధర చెల్లించాల్సిందే ! "అని ఆయన తన ట్వీట్‌లో రాశారు.
Wake up Delhiites
Delhi has become a gutter
Nothing is for free, this is the PRICE!!
ఇంతకుముందు కూడా ఈ వరదల ప్రభావంపై గౌతమ్ గంభీర్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం సన్నద్ధత లేదని బీజేపీ నేత గౌతమ్ గంభార్ ఆరోపించారు. అయితే యమునా నదిలో గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదని ఆప్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు కూడా ప్రజల ప్రాణాలను కాపాడటమే తన ప్రాధాన్యత.
ఈ విపత్తుపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ పలు అత్యవసర ప్రకటనలు చేశారు. ఢిల్లీలో పాఠశాలలు , కళాశాలలు ఆదివారం వరకు మూసివేయాలని ఆదేశించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లో పనులు నిర్వహించాలని ఆఫీసులకు సూచించింది. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో హర్యానా బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ అదనపు నీటి కారణంగా ఢిల్లీలోని యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
అంతకుముందు రోజు.. కేజ్రీవాల్ కేంద్రం సహాయం కోరుతూ హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజీ నుంచి నియంత్రిత పద్ధతిలో నీటిని విడుదల చేయాలని ఆయన అన్నారు.
ఆ తర్వాత కేంద్ర జల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తనకు ఫోన్ చేసి హత్నికుండ్‌లో నీటిని నియంత్రించడం సాధ్యం కాదని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ నుండి విడుదలయ్యే నీటిని నిలిపివేశారు, దీని కారణంగా హత్నికుండ్‌లో నీరు తగ్గుతుంది. దీంతో ఢిల్లీకి వచ్చే యమునా జలాలు తగ్గుతాయి.