చిన్నచిన్న సంఘటనలే హృదయం ద్రవించే ఎమోషన్స్ ని పండిస్తుంటాయి. అలాంటి ప్యామిలీ ఎమోషన్ సీన్ చెన్నై-కోయంబత్తూరు విమానంలో చోటుచేసుకుంది. ఈ ఎమోషనల్ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
చెన్నై : చిన్నపుడు గాల్లోకి ఎగరేస్తూ ఆడించిన తాతను గాలిమోటర్ ఎక్కించాడు... గుండెలపై ఆడించిన అవ్వను ఆకాశంలో తిప్పాడు... నవమాసాలు మోసిన కన్నతల్లిని తన విమానంలో మోసాడు... ఇలా తాను నడిపే విమానంలో కుటుంబాన్ని ఎక్కించుకుని మైమరచి పోయాడు ఆ పైలట్. నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు వందలసార్లు విమానం నడిపిన అతడు ఎన్నడూ ఇంతటి ఆనందాన్ని పొందివుండడు... తన కుటుంబంతో ప్రయాణం అతడి జీవితంలో మరిచిపోలేనిదిగా మిగిలిపోయివుంటుంది. ఇలా ఓ పైలట్ మధుర ప్రయాణానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే... తమిళనాడుకు చెందిన ప్రదీప్ ఓ ప్రముఖ విమానయాన సంస్థలో పైలట్. చిన్నప్పటి నుండి ప్రస్తుతం పైలట్ గా ఉన్నతస్థాయికి చేరుకునే వరకు తనకోసం కుటుంబం ఎంత కష్టపడిందో అతడికి తెలుసు. ఇంతకాలం ఎంతో కష్టపడిన వారిని అతడు ఎంతో ఆనందంగా చూసుకుంటున్నాడు. ప్రదీప్ తన కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో తాజా వీడియోను చూస్తే అర్థమవుతుంది.
తాను నడిపే విమానంలోనే తన కుటుంబాన్ని తీసుకెళుతూ సరికొత్త అనుభూతికి లోనయ్యాడు ప్రదీప్. విమానంలోని మిగతా ప్రయాణికులకు తన కుటుంబాన్ని పరిచయం చేయడం చూస్తే ఆ క్షణం అతడు ఎంతలా ఆనందిస్తున్నాడో అర్థమవుతుంది. తమిళనాడు రాజధాని చెన్నై నుండి కోయంబత్తూరు వెళుతున్న విమానంలో తన తల్లి, తాత, బామ్మలను ఎక్కించుకు తీసుకెళ్లాడు ప్రదీప్. ఈ సందర్భంగా తన వాళ్లతో తనకిది తొలి విమాన ప్రయాణమని... రోజూ నడిపే విమానమే అయినా ఈ ప్రయాణం సరికొత్తగా వుందని చెప్పుకుంటూ వచ్చాడు.
తన చిన్నపుడు తాత స్కూటర్ పై ఎక్కించుకుని తిరిగేవారని... ఇప్పుడు ఆయనను విమానంతో తిప్పే అవకాశం వచ్చిందంటూ పైలట్ ప్రధీప్ ఎమోషన్ అయ్యాడు. తన మనవడు విమానంలోని మిగతా ప్రయాణికులకు పరిచయం చేస్తుంటే ఆ తాత ఒకింత గర్వంగా ఫీలయ్యాడు. ప్రధీప్ బామ్మ కూడా మనవడి మాటలు విని ఎమోషన్ అయ్యింది.
హైదరాబాద్ ను గెలిపించాడు... కొడుకుగా గెలిచాడు : తల్లి చేతికి అభిషేక్ శర్మ అవార్డులు
ఇక తన కొడుకు పైలట్ డ్రెస్ లో చూసి ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ గురించి కొడుకు చెబుతున్న మాటలువిన్న ఆ తల్లి కన్నీటిని ఆపుకోలేకపోయింది. ఆనందంతో ఆమె కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఈ ఎమోషనల్ సీన్ ఆ కుటుంబానికి మధురానుభూతి మిగిలించింది. పైలట్ కుటుంబసభ్యుల ప్రేమానురాగాలు చూసి మిగతా ప్రయాణికులు కూడా ఖచ్చితంగా తమ కుటుంబాలను గుర్తుచేసుకుని వుంటారు. ఆ విమానంలో అంతలా ఎమోషన్ పండింది.
వీడియో
మొదటి సారి పేరెంట్స్‌ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్..ఆనందంతో తల్లి కంటతడి
చెన్నై- కోయంబత్తూరు విమానంలో ప్రదీప్ అనే పైలట్ తన తల్లి, బామ్మ, తాతను మొదటి సారి విమానం ఎక్కించి సర్‌ప్రైజ్ చేశాడు.
మావాళ్లు నాతో మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారు. తాత చిన్నప్పుడు స్కూటర్ పై నన్ను… pic.twitter.com/tmjeqKHzA8