Gigantic Ocean: శాస్త్రవేత్తలు నిత్యం ఎన్నో రకరకాల పరిశోధనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మనవుడి ఊహాకందని ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుక వస్తుంటాయి. తాజాగా అలాంటి ఆవిష్కరణనే వెలుగుచూసింది. భూ అంతర్ పొరల్లో ఓ భారీ మహా సముద్రాన్ని కనుగొన్నారట. అందులో నీటి భూమి ఉపరితలం మీద ఉన్న నీటి కంటే.. 3 రెట్లు అధిక ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భారీ మహా సముద్ర విశేషాలు మీకోసం..
Gigantic Ocean: ఇటీవలి కాలంలో పలు శాస్త్రీయ ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. భారీ బ్లాక్ హోల్ నుండి దక్షిణ కొరియా ఫ్యూజన్ రియాక్టర్ వరకు ఎన్నో అద్బుతాలు ఈ విశ్వంపై ఉన్న మనకు ఉన్న దృక్పథాన్ని మార్చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరోకటి తెరపైకి వచ్చింది. మానవ ఊహాకు అందని, మానవుడు అసలు ఆలోచించలేని ఓ కొత్త అద్బుతం వెలుగులోకి వచ్చింది. అదే భూమి అంతర పొరల్లో దాగి ఉన్న భారీ మహా సముద్రం. భూమి పొరల్లో మహాసముద్రమేంటీ ? అనుకుంటున్నారా? వినడానికి విచిత్రంగా ఉన్న నిజమండీ.
ఈ భారీ మహా సముద్రం.. అంత ఇంత కాదు.. ప్రపంచంలో ఉన్న ఐదు మహా సముద్రాల కంటే చాలా పెద్దంట. అలాగే..ఇందులో ఉంటే నీటి పరిణామం కూడా ఈ ఐదు మహా సముద్రాల్లో ఉన్న నీటి కంటే మూడు రెట్లు ఎక్కువట. ఈ భారీ మహాసముద్రానికి ’గిగాంటిక్ మహాసముద్రం’ అని నామకరణం చేశారు సైంటిస్ట్‌లు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
సాధారణంగా భూ అంతర్ నిర్మాణాన్ని మూడు పొరలుగా విభజించవచ్చు. 1,భూపటం( 0- 100 కి.మీ), 2. భూ ప్రావారం (100 కిమి - 2900), 3.భూకేంద్ర మండలం( 2900- 6376). ఈ ఈ విస్తారమైన భూపటం క్రింద భూప్రావారంలో కనుగొనబడింది. ఈ భారీ సముద్రం భూమి ఉపరితలానికి సుమారు 700 కిలోమీటర్ల లోతులో రింగ్‌వుడైట్ అనే రాయి లోపల భారీగా నీరు ఉందని తాజాగా నిర్వహించిన రీసెర్చ్‌లో సైంటిస్ట్‌లు గుర్తించారు.
undefined
ఈ భూగర్భ సముద్రంలో నీరు ఎంత ఉందంటే.. భూమి ఉపరితలంపై ఉన్న అన్ని మహాసముద్రాల మొత్తం నీటి పరిమాణం కంటే మూడు రెట్లు ఉంటుందని అంచనా వేయబడింది. ఈ మహాసముద్రానికి సంబంధించిన వివరాలను "డీహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ మ్యాంటిల్" అనే పేరుతో ఓ పరిశోధన నివేదికను విడుదల చేశారు భూగర్భ శాస్త్రవేత్తలు. ఈ పరిశోధన నివేదికలో రింగ్‌వుడైట్ రాయికి ఉన్న ప్రత్యేక లక్షణాలను వారు వివరించారు.
ఈ అద్భుత ఆవిష్కరణ చేసిన బృందంలో కీలక సభ్యుడు జియోఫిజిసిస్ట్ స్టీవ్ జాకబ్‌సెన్ మాట్లాడుతూ.. 'రింగ్‌వుడైట్ నీటిని పీల్చుకునే స్పాంజ్ లాంటిదనీ, హైడ్రోజన్‌ని ఆకర్షించడానికి, నీటిని పీల్చుకునే రింగ్‌వుడైట్ క్రిస్టల్ నిర్మాణంలో ప్రత్యేకమని తెలిపారు. తమ అధ్యయనంలో భూ అంతర్ నిర్మాణానికి సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. అలాగే.. భూమి ఉపరితలంపై నీరు ఏర్పడటానికి గల ఆధారమే ఈ గిగాంటిక్ సముద్రమేనని తెలిపారు. భూమిపైకి భారీ స్థాయిలో నీరు ఎలా వచ్చిందే ఈ గిగాంటిక్ మహాసముద్రం తెలియజేస్తుందని తెలిపారు. భూమి అంతర్గ భాగంలోని పొరల్లో దాగి ఉన్న ఈ నీటి నిక్షేపాల కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఈ భారీ మహా సముద్రంలో బయటపడిందని వివరించారు.
ఈ భూగర్భ సముద్రాన్ని గుర్తించేందుకు USలో 2000 సీస్మోమీటర్ల విస్తృత నెట్‌వర్క్‌ను రూపొందించారు. ఇందు కోసం 500 కంటే ఎక్కువ భూకంపాల నుండి వెలువడే తరంగాలను పరిశీలించారు. ఈ తరంగాలు.. భూమి లోపలి పొరల గుండా వెళతాయి. తేమతో కూడిన రాళ్ల గుండా వెళుతున్నప్పుడు ఈ తరంగాలు నెమ్మదిగా ప్రయాణిస్తాయి. ఇలా భూకంపాలపై పరిశోధనలు జరిపిన సైంటిస్ట్‌లు ఉపయోగించే.. భూకంపాలను కొలిచే సీస్మోమీటర్ ను ఉపయోగించి, భూమి అడుగునున్న నీటి జాడను కనుగొన్నారు.
భూమిలో చాలా లోతుగా ఉన్న ఈ భారీ సముద్రం.. నీటి చక్రం గురించి మన అవగాహనను పూర్తిగా మార్చగలదనీ, భూమి కింద సముద్రం లేకపోతే భూమి మొత్తం నీటితో నిండిపోతుందని , భూమిపై ఎత్తైన పర్వతాల శిఖరాలను మాత్రమే చూడగలుగుతామని పేర్కొన్నారు. మిగిలిన భూమి నీటిలో ఉంటుందనీ,. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు భూకంప డేటాను సేకరించాలనుకుంటున్నారని, ఈ మహా సముద్ర ప్రాముఖ్యతను జాకబ్సెన్ నొక్కి చెప్పారు.