ఫ్యామిలీ ప్లానింగ్ పై నిర్ణయం దంపతులదే..

By AN TeluguFirst Published Dec 12, 2020, 3:18 PM IST
Highlights

ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాలని దేశ ప్రజలను ప్రభుత్వం బలవంతపెట్టలేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు జనాభా నియంత్రణపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై కేంద్రం న్యాయస్థానానికి తమ అఫిడవిట్ సమర్పించింది. పిల్లలపై నిబంధనలు పెడితే జనాభా వక్రీకరణకు దారితీసే ప్రమారం ఉందని పేర్కొంది.

ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాలని దేశ ప్రజలను ప్రభుత్వం బలవంతపెట్టలేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు జనాభా నియంత్రణపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై కేంద్రం న్యాయస్థానానికి తమ అఫిడవిట్ సమర్పించింది. పిల్లలపై నిబంధనలు పెడితే జనాభా వక్రీకరణకు దారితీసే ప్రమారం ఉందని పేర్కొంది.

అంతేకాదు దేశంలో కుటుంబ సంక్షేమ పథకం స్వచ్ఛందమైనదని కేంద్ర ఆరోగ్యశాఖ అఫిడవిట్ లో పేర్కొంది. తమకు ఎంతమంది పిల్లలు కావాలో అది పూర్తిగా దంపతుల ఇష్టమేనని, కుటుంబనియంత్రణపై ఎలాంటి ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసింది. కుటుంబ నియంత్రణపై బలవంతపు చర్యలను భారత్ నిస్సందేహంగా వ్యతిరేకిస్తోందని తెలిపింది. 

ఒకవేళ నిర్థిష్ట సంఖ్యలో మాత్రమే పిల్లలు ఉండాలని ప్రజలను బలవంతపెడితే అది జానాభా వక్రీకరణకు దారితీసే ప్రమాదం ఉందని, అంతర్జాతీయ అనుభవాలు కూడా ఇవే చెబుతున్నాయని తెలిపింది. అయితే భారత్ లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గతోందని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

2000 సంవత్సరంలో జాతీయ జనాభా విధానాన్ని అవలంభించిన సమయంలో సంతానోత్పత్తి రేటు 3.2శాతంగా ఉండగా.. 2018 నాటికి అది 2.2 శాతానికి తగ్గిందని పేర్కొంది. 
2025 నాటికి సంతానోత్పత్తి రేటు 2.1 శాతంగా ఉండేలా లక్ష్యం పెట్టకున్నట్లు తెలిపింది. దేశంలో జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టేలా, ఇద్దరు పిల్లల నిబంధనను తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలంటూ భాజపా నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.  

జనాభా పెరుగుదలతో కాలుష్యం, నిరుద్యోగం పెరుగుతోందని, కనీస అవసరాలు అందరికీ చేరలేకపోతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేగాక, అవినీతికి కూడా జనాభా పెరుగుదల  కారణమవుతోందని ఆరోపించారు. అయితే ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. జనాభా నియంత్రణపై చట్టాలు చేసేది పార్లమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలేనని, కోర్టులు కాదని న్యాయస్థానం తెలిపింది. 

దీంతో డిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఫిడవిట్ దాఖలు చేసింది. 

click me!