నోయిడా అథారిటీ కార్యాలయం ముందు ఆందోళన:746 మంది రైతులపై కేసులు

By narsimha lode  |  First Published Feb 21, 2024, 4:21 PM IST

నోయిడా అథారిటీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన  రైతులపై  పోలీసులు కేసు నమోదు చేశారు.


న్యూఢిల్లీ: తమ డిమాండ్ల సాధన కోసం  నోయిడా అథారిటీ కార్యాలయం ముందు ఈ ఏడాది జనవరి  18న ఆందోళన నిర్వహించిన వారిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  నోయిడా అథారిటీ కార్యాలయానికి తాళం వేసిన  746 మంది రైతులపై  పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ విషయమై  సంబంధిత కార్యాలయంలో పనిచేసే జేఈ ఫిర్యాదు మేరకు పోలీసులు  జనవరి  23న కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. దాదాపు నెల రోజుల తర్వాత ఈ ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. ఈ బూటకపు కేసును ఉపసంహరించుకోవాలని  సీఎంతో నిర్వహించిన సమావేశంలో రైతులు డిమాండ్ చేశారు. 

Latest Videos

undefined

భారతీయ కిసాన్ పరిషత్ జాతీయ అధ్యక్షుడు సుఖ్ వీర్ ఖలీఫాతో పాటు  746 మంది రైతులపై కేసు నమోదు చేశారు.  ఈ ఏడాది జనవరి  18న నోయిడా అధారిటీ కార్యాలయాన్ని లాక్ డౌన్ చేయడానికి రైతులు వచ్చారని  పేర్కొన్నారు.  ఈ సందర్భంగా నిర్వహించిన ఆందోళన నేపథ్యంలో  రైతులపై  పోలీసులు కేసు నమోదు చేశారు.నోయిడా అథారిటీ ముందు ఆందోళనకు దిగిన 746 మంది రైతులపై  పోలీసులు కేసు నమోదు చేశారు. నెల రోజుల తర్వాత ఈ విషయం వెలుగు చూసింది.

నోయిడా అథారిటీ కార్యాలయం ముందు నిరసనతో పాటు కార్యాలయానికి తాళం వేసిన ఆరోపణలతో  746 మంది రైతులపై  ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుల అంశం వెలుగు చూడడంతో  కేసులను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.తమపై తప్పుడు కేసులు బనాయించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

ఈ ఏడాది జనవరి 18న నోయిడా అధారిటీ అధికారులకు వ్యతిరేకంగా  రైతులు నినాదాలు చేశారు. కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఆందోళనకారులను వారించారు.  అయినా కూడ పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారు. ఈ సమయంలో  పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ సమయంలో  ప్రవేశ ద్వారం వద్ద జాతీయ జెండాను అపవిత్రం చేశారనే ఆరోపణలు కూడ వచ్చాయి. లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులపై దాడి చేశారనే  ఆరోపణలు కూడ వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఎస్ఐ  ప్రదీప్ ద్వివేది, హెడ్ కానిస్టేబుల్ ప్రభాత్ సింగ్ లకు కూడ తీవ్ర గాయాలయ్యాయి. కొందరు అధికారుల గొంతు నొక్కడానికి కూడ  ప్రయత్నించారనే ఆరోపణలు కూడ వెలుగు చూశాయి. అంతేకాదు తొక్కిసలాట జరిగింది. 

అంతేకాదు ఈ సందర్భంగా చోటు చేసుకొన్నహింసాత్మక ఘటనలతో  నోయిడా డెవలప్ మెంట్ అథారిటీ ప్రాంతంలో నివసించే వారు  భయాందోళనలు వ్యక్తం చేశారు. కొందరు తమ వ్యాపార సంస్థలను మూసివేశారు.  ఈ గందరగోళం కారణంగా  ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు కూడ ఇబ్బందులు నెలకొన్నాయి.  ఈ కేసు విషయం వెలుగు చూడడంతో  భారతీయ కిసాన్ పరిషత్ జాతీయ అధ్యక్షుడు సుఖ్ వీర్ ఖలీఫా  స్పందించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి రహస్యంగా ఉంచడాన్ని ఆయన తప్పుబట్టారు.


 

click me!