రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ప్రజలిచ్చిన నిజమైన నివాళి ఇదే: మోడీ

By Sree s  |  First Published Apr 14, 2020, 12:43 PM IST

ఏప్రిల్ 14వగా తేదీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీం రావు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితమే మనకు ఈ కరోనా కష్టకాలంలో స్ఫూర్తి అన్నారు. 


భారతప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ను మే 3వ తేదీవరకు పొడిగించిన విషయం తెలిసిందే! ఇందుకుగాను ఆయన నేటి ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు. నేడు ఏప్రిల్ 14వగా తేదీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీం రావు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితమే మనకు ఈ కరోనా కష్టకాలంలో స్ఫూర్తి అన్నారు. 

భారత రాజ్యాంగం "వీ ద పీపుల్ అఫ్ ఇండియా...."అని ప్రారంభమవుతుందని, ఆ సామూహిక శక్తే మనము ఈ కరోనా పై పోరులో చూపించమని, అదే ఆయనకు నిజమైన నివాళి అని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. 

Latest Videos

జీవితంలో  ఎటువంటి సవాలునైనా, మన సంకల్ప శక్తితో,   కఠోర పరిశ్రమతో ఎదుర్కొని విజయం సాధించవచ్చనే విషయాన్ని బాబాసాహెబ్ జీవితం మనకు నేర్పిస్తుందని, అది మనకు నిరంతరం ప్రేరణనిస్తుందని ప్రధాని ఈ సందర్భంగా  అన్నారు.  

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకుగాను ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ‌ను పొడిగిస్తున్నట్టుగా ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రకటించారు. మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. 

కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తోందన్నారాయన..ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశాన్ని రక్షించారన్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సాగిస్తున్నారన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశాన్ని రక్షిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

కరోనాపై బారత్ బలంగా పోరాటం చేస్తున్న విషయాన్ని మోడీ గుర్తుచేశారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరాన్ని జరుపుకొంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కరోనాపై పోరాటం చేయడంలో దేశం మొత్తం ఒకేతాటిపై ఉందన్నారు ప్రధాని. దేశంలో ఒక్కకరోనా కేసు నమోదు కాకముందే దేశంలోకి వచ్చేవారిని స్క్రీనింగ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దేశంలో కరోనా మహహ్మరిగా మారకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నట్టుగా మోడీ వివరించారు. 21 రోజుల పాటు లాక్‌డౌన్ సమర్ధవంతంగా అమలు చేసినట్టుగా చెప్పారు. 
కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా కేసులు దేశంలో తక్కువగా ఉన్నాయన్నారు. 

 బౌతిక దూరం దేశానికి చాలా ఉపయోగపడిందని మోడీ అభిప్రాయపడ్డారు. ఎకానమీ కంటే జీవితం గొప్పదన్నారు.ఈ నెల 20వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు.

ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఆంక్షల్లో సడలింపు ఉంటుందని ఆయన సూచన ప్రాయంగా చెప్పారు. హాట్ స్పాట్స్ కాని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత ఆంక్షలను సడలించనున్నట్టుగా ఆయన చెప్పారు. ఆహారానికి, నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కొత్తగా కేసులు నమోదు కాని ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి సడలింపులు ఉంటాయని చెప్పారు.

కరోనా హాట్‌స్పాట్లపై ఫోకస్ పెట్టినట్టుగా ప్రధాని ప్రకటించారు. లాక్‌డౌన్‌పై మార్గదర్శకాలను రేపు విడుదల చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ వారం ఇండియాకు అత్యంత క్లిష్టమైన వారంగా ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలని మోడీ సూచించారు.

click me!