Pegasus: పెగాస‌స్ ప్ర‌కంప‌న‌లు.. సుప్రీకోర్టు క‌మిటీ ముందుకు ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు మాత్ర‌మే.. !

Published : Feb 03, 2022, 03:20 PM IST
Pegasus: పెగాస‌స్ ప్ర‌కంప‌న‌లు.. సుప్రీకోర్టు క‌మిటీ ముందుకు ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు మాత్ర‌మే.. !

సారాంశం

Pegasus spyware: న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నంలో మ‌ళ్లీ దేశంలో పెగాస‌స్ స్పై వేర్ వ్య‌వ‌హారం రాజ‌కీయ ర‌చ్చ చేస్తోంది. ఇప్ప‌టికే సుప్రీంకోర్టు పెగాస‌స్ వ్య‌వ‌హారంపై ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. త‌మ‌కు చెందిన గ్యాడ్జెట్స్ లోకి పెగాస‌స్ ను పంపించి..నిఘా పెట్టార‌ని పేర్కొంటున్న వారు త‌మ‌ డివైస్‌ల‌ను అందించాల‌ని సుప్రీంకోర్టు ప్యానెల్ ఇదివ‌ర‌కే పేర్కొంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు వ్య‌క్తులు మాత్ర‌మే స్పైవేర్ బారిన‌ప‌డింద‌ని పేర్కొంటూ రెండు ఫోన్ల‌ను చూపించారు. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీం ప్యానెల్ తమను సంప్రదించాలని మరో ప్రకటన జారీ చేసింది.   

Pegasus spyware: మ‌ళ్లీ దేశంలో పెగాస‌స్ స్పై వేర్ వ్య‌వ‌హారం రాజ‌కీయ ర‌చ్చ చేస్తోంది. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ స‌ర్కారును టార్గెట్ చేస్తూ.. తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఇప్ప‌టికే పెగాస‌స్ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో ప‌లు పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి. అయితే, ఇప్ప‌టికే సుప్రీంకోర్టు పెగాస‌స్ వ్య‌వ‌హారంపై ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. త‌మ‌కు చెందిన గ్యాడ్జెట్స్ లోకి పెగాస‌స్ ను పంపించి..నిఘా పెట్టార‌ని పేర్కొంటున్న వారు త‌మ‌ డివైస్‌ల‌ను అందించాల‌ని సుప్రీంకోర్టు ప్యానెల్ ఇదివ‌ర‌కే పేర్కొంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు వ్య‌క్తులు మాత్ర‌మే స్పైవేర్ (Pegasus spyware) బారిన‌ప‌డింద‌ని పేర్కొంటూ రెండు ఫోన్ల‌ను చూపించారు. దీంతో సుప్రీంకోర్టు టెక్నిక‌ల్ క‌మిటీ మ‌ళ్లీ మ‌రో ప‌బ్లిక్ నోటీసు జారీ చేసింది. త‌మ ఎల‌క్ట్రానికి ప‌రిక‌రాలు (మొబైల్‌, ల్యాప్‌టాప్ సంబంధిత ఎల‌క్ట్రానికి గ్యాడ్జెట్స్) ను త‌మ‌కు అందించాల‌నీ, సంబంధిత వ్య‌క్తులు త‌మ‌ను సంప్ర‌దించాల‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో సుప్రీంకోర్టు ప్యానెల్ పేర్కొంది. 

పెగాస‌స్ స్పైవేర్ (Pegasus spyware) విష‌యంలో ఏర్పాటైన సుప్రీంకోర్టు ప్యానెల్ ఈ ప్ర‌క‌ట‌న‌ను బుధ‌వారం (జ‌న‌వ‌రి 2న‌) నాడు విడుద‌ల చేసింది. ఇజ్రాయిల్ ఎన్ఎస్ వో గ్రూప్ న‌కు చెందిన పెగాస‌స్ స్పైవేర్ తో త‌మ పై నిఘా పెట్టార‌నీ, దానికి సంబంధించిన స‌హేతుక కార‌ణాల‌ను పేర్కొంటూ.. సంబంధిత మొబైల్, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ గ్యాగ్జెట్స్ తో త‌మ‌ను సంప్ర‌దించాల‌ని సుప్రీంకోర్టు (Supreme Court) ప్యానెల్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా, ఇప్ప‌టికే ఈ ప్యానెల్ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేసింది. ఆ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన నెల గ‌డిచిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు మాత్ర‌మే సుప్రీంకోర్టు ప్యానెల్ ముందుకు వ‌చ్చార‌నీ, త‌మ ఫోన్ ల‌లో పెగాస‌స్ స్పైవేర్ ను చొప్పించి.. నిఘా పెట్టిన‌ట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఫోన్ల‌ను క‌మిటీకి అందించారు. అయితే, ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌నే వివ‌రాలు తెలియ‌రాలేదు. ఈ నేప‌థ్యంలోనే మ‌రోసారి సుప్రీంకోర్టు క‌మిటీ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఫిబ్రవరి 8 వ‌ర‌కు అభ్య‌ర్థ‌న‌లు స్వీక‌రిస్తామ‌ని గ‌డువు విధించింది. కాగా, పెగాస‌స్ స్పైవేర్ (Pegasus spyware) ఉంద‌ని క‌మిటీని ఆశ్ర‌యించిన వారి మొబైల్ ఫోన్ల డిజిట‌ల్ ఇమేజ్ ను నిపుణుల కమిటీ తీసుకుంటుంది. దాని కాపీని బాధితుల‌కు కూడా అందిస్తుంది. 

దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware)పై సుప్రీంకోర్టులో తాజాగా  మరో పిటిషన్ దాఖలైంది.  ఎన్ఎస్‌వో గ్రూప్ త‌యారుచేసిన పెగాస‌స్ స్పైవేర్ కు సంబంధించి భార‌త్‌ -ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని  ప్ర‌ముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టు (Supreme Court) లో మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయించాల‌నీ, దీనిపై పూర్తి స్థాయి విచార‌ణ జ‌రిపించాల‌ని ఎంఎల్ శ‌ర్మ త‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు. పిటిష‌న్‌కు పెగాస‌స్‌పై న్యూయార్క్ టైమ్స్ (New York Times) ఇటీవ‌ల ప్ర‌చురించిన సంచ‌ల‌న క‌థ‌నం వివ‌రాల‌ను సైతం ఆయ‌న జోడించారు.  భారత ప్రభుత్వం స్పైవేర్ ను కోనుగోలు చేసిందా?  పార్లమెంటేరియన్లు, జర్నలిస్టులు, కార్యకర్తలు, కోర్టు సిబ్బంది, మంత్రులు సహా దేశ‌ పౌరులపై నిఘా పెట్ట‌డానికి స్పైవేర్ ను ప్ర‌భుత్వం ఉప‌యోగించిందా? అనే విష‌యాల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని కోరుతూ గ‌తంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లలో న్యాయవాది ఎంఎల్ శ‌ర్మ ఒకరు. గ‌తంలో దాఖ‌లైన పిటిష‌న్ల నేప‌థ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) పెగాస‌స్ స్పైవేర్ తో నిఘా పెట్టార‌నే వాటిపై ద‌ర్యాప్తు  చేయ‌డానికి సుప్రీంకోర్టు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?