విద్యార్థుల కేరీర్‌తో ఆటలాడలేం.. గేట్ పరీక్ష వాయిదాకు నిరాకరించిన సుప్రీంకోర్టు

Published : Feb 03, 2022, 02:47 PM IST
విద్యార్థుల కేరీర్‌తో ఆటలాడలేం.. గేట్ పరీక్ష వాయిదాకు నిరాకరించిన సుప్రీంకోర్టు

సారాంశం

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022) పరీక్షలను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు ( Supreme Court) గురువారం నిరాకరించింది. కరోనా వల్ల పరీక్ష వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌ను కొట్టివేసింది.

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022) పరీక్షలను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు ( Supreme Court) గురువారం నిరాకరించింది. కరోనా వల్ల పరీక్ష వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌ను కొట్టివేసింది. పరీక్షలను ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులలో గందరగోళం, అనిశ్చితి ఏర్పడవచ్చని పేర్కొంది. 48 గంటల ముందు పరీక్ష నిలిపివేత సరికాదని వెల్లడించింది. పరీక్ష నిలిపివేస్తే అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారని తెలిపింది. గేట్ పరీక్షకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎగ్జామ్స్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. 

ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా గేట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలువురు గేట్ అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వానికి, గేట్ 2022 పరీక్షను నిర్వహిస్తున్న ఇండియాన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 200 కేంద్రాల్లో తొమ్మిది లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని.. అయితే పరీక్ష నిర్వహణకు అధికారులు తగిన కోవిడ్-19 మార్గదర్శకాలను జారీ చేయలేదని అందుకే వాటిని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

 ‘కోవిడ్ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్.. పలు రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాప్తి చెందింది. ఐఐటీ కాన్పూర్ చేసిన అనేక అధ్యయనాలు ఫిబ్రవరి ప్రారంభంలో కోవిడ్ థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ఏప్రిల్ చివరి నాటికి ముగుస్తుందని అంచనా వేసింది. అయితే కోవిడ్ థర్డ్ వేవ్ గరిష్ట స్తాయికు చేరుకునే సమయం.. గేట్ పరీక్ష తేదీలో ఉన్నాయి. పరీక్షలు వాయిదా వేయకుంటే గేట్ 2022కి హాజరయ్యే అభ్యర్థులు వైరస్ బారిన పడి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. తద్వారా వారి ప్రాణాలతో పాటుగా, వారి కుటుం సభ్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఈ పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సూర్య కాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పరీక్షలు ప్రభుత్వం విధానపరమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో పరీక్షల విషయంలో కోర్టు ఏదైనా జోక్యం చేసుకుంటే అది విద్యార్థుల్లో గందరగోళం, అనిశ్చితికి దారి తీస్తుందని పేర్కొంది. పరీక్ష కోసం విద్యార్థులు సన్నద్ధమయ్యారని, పరీక్షను వాయిదావేసి విద్యార్థుల జీవితాలతో సుప్రీంకోర్టు ఆటలాడుకోదని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము ఇలా పరీక్షలను వాయిదా వేయడం ప్రారంభించలేమని పేర్కొంది. 

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుండగా.. కేవలం 20,000 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేశారని సుప్రీంకోర్టు పేర్కొంది.
 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?