ఇటాలియన్ తల్లి, ఇండియన్ తండ్రి.. అందుకే ఆలోచనల్లోనే తేడా: రాహుల్‌పై హర్యానా హోం మంత్రి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 03, 2022, 02:29 PM IST
ఇటాలియన్ తల్లి, ఇండియన్ తండ్రి.. అందుకే ఆలోచనల్లోనే తేడా: రాహుల్‌పై హర్యానా హోం మంత్రి వ్యాఖ్యలు

సారాంశం

‘రెండు భారత్’లు అంటూ కాంగ్రెస్ (congress) ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi) చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ (anil vij) ఘాటు వ్యాఖ్యలు చేశారు

‘రెండు భారత్’లు అంటూ కాంగ్రెస్ (congress) ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi) చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ (anil vij) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పుట్టుక ఆధారంగానే ఆయన ఆలోచనలు ఉంటున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఇటలీ తల్లి, ఇండియన్ తండ్రి అడుగుజాడల్లో పెరిగిన గాంధీ వారసుడికి.. ఒకటే భారత్ కు బదులు రెండు భారత్ లు కనిపిస్తున్నాయంటూ అనిల్ విజ్ అన్నారు. అందుకే ఆ రెండు దేశాల సంస్కృతులూ రాహుల్ కు ఒంటబట్టాయని.. అందుకేనేమో అతడి ఆలోచనల్లోనే ఏదో తేడా ఉంటోంది’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అటు రాహుల్ చేసిన కామెంట్స్‌పై అగ్ర రాజ్యం అమెరికా కూడా స్పందించింది.ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అనుసరిస్తున్న విదేశాంగ విధానం పాకిస్థాన్- చైనాల సంబంధాలను బలోపేతం చేసిందన్న రాహుల్ గాంధీ వాదనతో తాము ఏకీభవించబోమని అగ్ర రాజ్యం అమెరికా పేర్కొంది. దీనిని ఆ రెండు దేశాలకే వదిలేస్తున్నట్టుగా తెలిపింది.

బుధవారం పార్లమెంటులో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని కోరినప్పుడు యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ (Ned Price) స్పందించారు. ‘పాకిస్థాన్‌, చైనా సంబంధాల గురించి మాట్లాడటానికి నేను దానిని ఆ రెండు దేశాలకే వదిలివేస్తాను. నేను ఖచ్చితంగా  ఆ వ్యాఖ్యలను సమర్థించను’ అని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ దేశమూ యునైటెడ్ స్టేట్స్,  చైనాల‌లో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం లేదని తాము అన్ని దేశాలకు ఇదివరకే చెప్పామని అన్నారు. 

‘పాకిస్తాన్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి. ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వంతో మాకు ముఖ్యమైన సంబంధం ఉంది. అనేక రంగాలలో మేము విలువైన సంబంధాన్ని కలిగి ఉన్నాము’ అని నెడ్ ప్రైస్ చెప్పారు.

ఇక, లోక్‌సభలో బుధవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థ నుంచి ఎన్నికల సంఘం వరకు ప్రతి సంస్థపై దాడి చేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే.. వారి గొంతును అణిచివేసేందుకు న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్‌లను ప్రభుత్వ సాధనాలు మార్చుకుంద‌ని అన్నారు. ఇప్పుడు దేశంలో రెండు భారత్‌లు ఉన్నాయని.. ఒకటి పేదలదని, మరోకటి సంపన్నులదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ రెండింటినీ కలిపేందుకు కృషి చేయాలని సూచించారు. 

‘గణతంత్ర దినోత్సవం రోజున ఎందుకు విదేశీ అతిథిని తీసుకురాలేకపోతున్నారో మీరే ప్రశ్నించుకోండి. మనం పూర్తిగా ఒంటరి అయ్యాయి. మీరు పాకిస్తాన్, చైనాలను ఏకతాటిపైకి తెచ్చారు. చైనాను, పాకిస్తాన్‌ను వేరు చేయడం భారత్‌ ఏకైక అతిపెద్ద వ్యూహాం. కానీ మోదీ ఆ రెండు దేశాలనూ కలిపారు. దాని వల్ల వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ. ఇది మీరు చేసిన అతిపెద్ద నేరం’ రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్