
రెండు రోజులు పాటు అట్టుడుకుపోయిన హర్యానాలోని గురుగ్రామ్, నూహ్ లో ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని, ఇంటర్నెట్ పనిచేస్తోందని గురుగ్రామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరుణ్ దహియా (క్రైమ్) తెలిపారు.
మృత్యుంజయుడు.. థానే ప్రమాదంలో 115 అడుగుల ఎత్తులో నుంచి పడినా.. గాయాలతో బయటపడ్డ కార్మికుడు
‘‘పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇంటర్నెట్ కూడా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా ఏదైనా సమాచారం ఇవ్వాలనుకుంటే హెల్ప్ లైన్ నెంబర్ '112'ను సంప్రదించవచ్చు’’ అని గురుగ్రామ్ ఏసీపీ దహియా (క్రైమ్) తెలిపారు.
నూహ్ జిల్లాలో సోమవారం మొదలైన హింస క్రమంగా గురుగ్రామ్ సహా పరిసర ప్రాంతాలను చుట్టుముట్టింది. నగరంలో మంగళవారం మత ఘర్షణలు పెరిగాయి. ఈ ఘర్షణల్లో ఓ మతగురువు మృతి చెందగా, సెక్టార్ 57లోని మసీదు ధ్వంసమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గురుగ్రామ్ లోని బాద్షాపూర్ ప్రాంతంలోని పలు దుకాణాలు దోపిడీకి, విధ్వంసానికి గురయ్యాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రత నమోదు
నూహ్ లో హింస చెలరేగినప్పటి నుంచి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో గురుగ్రామ్ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా లూజ్ పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. హింసకు పాల్పడిన వారిపై దాదాపు 40 కేసులు నమోదు చేశామని, 100 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు మంగళవారం తెలిపారు.
ఇదిలా ఉండగా.. మేవాట్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) పిలుపునిచ్చింది. వీహెచ్ పీ అఖిల భారత సంయుక్త మహామంత్రి సురేంద్ర జైన్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. కాగా.. ఈ నిరసన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశముందని కేంద్ర సంస్థలు అంచనా వేశాయి. స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల సమీకరణపై నిశితంగా నిఘా పెట్టారు