
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో విమర్శలకు కారణం అయ్యింది. ఆ వీడియోలో ఎమర్జెన్సీ వార్డులో ఓ వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో నేలపై పడి ఉన్నాడు. అతని చుట్టూ రక్తం మడుగు కట్టింది.
అతని ముఖం మీద, తలపై భాగరంలో రక్తం మరకలు కనిపిస్తున్నాయి. స్పృహ తప్పి పడి ఉన్న ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూఓ వీధి కుక్క కూడా ఆ వీడియోలో కనిపించింది. 28-సెకన్లు ఉన్న ఆ వీడియోలో.. ఎమర్జెన్సీ వార్డులోని ఖాళీ బెడ్లు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక డాక్టర్ కానీ, నర్సు కానీ లేరు.
బస్సును ఢీ కొట్టిన విమానం రెక్క..ధ్వంసమైన బస్సు.. గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
దీనిమీద ఆసుపత్రి ఇన్‌చార్జి డాక్టర్ ఎస్‌కె వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. వ్యక్తి తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ వ్యక్తి ఆ సమయంలో తాగి ఉన్నాడని, చికిత్స సమయంలో మంచంపై నుంచి చాలాసార్లు పడిపోయాడని డాక్టర్ వర్మ పేర్కొన్నారు. అయితే, ఆ వీడియో తీసిన సమయంలో "డాక్టర్, డ్యూటీలో ఉన్న వార్డు బాయ్ వేరే వార్డులో ఎమర్జెన్సీకి హాజరవుతున్నారు" అని చెప్పాడు. ఆ వ్యక్తిని తర్వాత గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు డాక్టర్ వర్మ తెలిపారు.