గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలలో జాప్యం ఎందుకు? ఎన్నికల సంఘం క్లారిఫికేషన్

Published : Nov 03, 2022, 01:55 PM ISTUpdated : Nov 03, 2022, 02:12 PM IST
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలలో జాప్యం ఎందుకు? ఎన్నికల సంఘం క్లారిఫికేషన్

సారాంశం

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాతే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై జాప్యం ఎందుకు వహించిందనే ఆరోపణలు వచ్చాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభావం ఇందులో ఉన్నదా? అనే కోణంలో చర్చలు జరిగాయి. కానీ, వాటన్నింటికీ ఈ రోజు ఫుల్ స్టాప్ పెడుతూ సీఈసీ వివరణ ఇచ్చారు. ఈ రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటిస్తూ పలు కారణాలు వెల్లడించారు.  

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించకపోవడంపై చర్చ జరిగింది. అధికార పార్టీ ఈసిని ప్రభావితం చేస్తున్నదని, కేంద్రంలోని సర్కారు ఒత్తిడితోనే ఎన్నికల సంఘం.. పీఎం నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటన కోసమే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయలేదని కూడా విమర్శకుల నుంచి ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలకు ఎన్నికల సంఘం ఫుల్ స్టాప్ పెట్టింది.

ఈ రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించబోతున్నట్టు వెల్లడించింది. డిసెంబర్ 1వ తేదీ, 5వ తేదీల్లో గుజరాత్ అసెంబ్లీకి చెందిన మొత్తం 182 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కాగా, డిసెంబర్ 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనూ లెక్కిస్తామని వెల్లడించింది. ఇదే సందర్భంలో ఈసీ కీలక వివరణ ఒకటి ఇచ్చింది. 

Also Read: గుజరాత్‌లో మోగిన ఎన్నికల నగరా.. రెండు విడతల్లో ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై వచ్చిన విమర్శలకు సమాధానంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమాధానం ఇచ్చారు. నిష్పక్షపాతాన్ని వహించే గర్వించే విలువను ఎన్నికల సంఘం పాటిస్తున్నదని ఆయన అన్నారు. తాము వంద శాతం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.  కొందరు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేశారని వివరించారు. మాటల కంటే చేతలు, వాటి ఫలితాలే అసలు నిజాలను బలంగా వెల్లడిస్తాయని తెలిపారు. ఎన్నికల సంఘాన్ని విమర్శించే పార్టీలు కూడా పలుమార్లు ఊహించని ఫలితాలను రాబట్టాయని పేర్కొన్నారు. ఇందులో థర్డ్ అంపైర్ ఎవరూ ఉండరని, ఫలితాలే పని తీరుకు నిదర్శనం అని వివరించారు.

ఎన్నికల కోడ్ 38 రోజుల పాటు ఉంటుందని, ఇది చాలా స్వల్ప వ్యవధి అని ఆయన తెలిపారు. ఢిల్లీ ఎన్నికలకు సమానమైన వ్యవధి ఇది అని వివరించారు. షెడ్యూల్ విడుదల వాయిదా జరిగిందనే ఆరోపణలపై స్పందిస్తూ.. గుజరాత్ అసెంబ్లీ వ్యవధి ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఉన్నదని, ఈ తేదీకి ఫలితాల లెక్కింపునకు మధ్య 72 రోజుల గ్యాప్ ఉన్నదని వివరించారు.

Also Read: నేషనల్ వర్సెస్ రీజినల్.. ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు, ప్రాంతీయ పార్టీల టఫ్ ఫైట్.. టాప్ పాయింట్స్

‘మార్చి నెలకు ముందే మూడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఎన్నికల షెడ్యూల్ నిర్ణయించడానికి చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం’ అని అన్నారు. మోర్బిలో తీగల వంతెన విషాదాన్ని ఆయన ప్రస్తావించారు. ‘గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించడంలో కొంత ఆలస్యానికి ఇటీవలే జరిగిన ఓ విషాదం కూడా కారణం’ అని వివరణ ఇచ్చారు. ‘నిన్న రాష్ట్రంలో సంతాప దినంగా పాటించారు. కాబట్టి, చాలా అంశాలు ఇందులో ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం