రాజ‌కీయ జోక్యంపై ఒక్క ఉదాహ‌ర‌ణ చూపించండి.. రాజీనామా చేస్తా.. : కేర‌ళ సీఎంకు గ‌వ‌ర్న‌ర్ బ‌హిరంగ స‌వాల్

By Mahesh RajamoniFirst Published Nov 3, 2022, 1:35 PM IST
Highlights

Kerala: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తన రాజకీయ జోక్యానికి ఒక్క ఉదాహరణ చూపాలని సీఎం పినరయి విజయన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. సీఎం ఒక్క ఉదాహరణ చూపితే తాను రాజీనామా చేస్తానని గవర్నర్ అన్నారు.
 

Kerala Politics: కేర‌ళ గ‌వ‌ర్న‌ర్, రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌ధ్య వివాదం కొన‌సాగుతూనే ఉంది. వీరిద్ద‌రూ చేస్తున్న వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయాల‌ను, అక్క‌డి ప‌రిస్థితుల‌ను వేడెక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే గ‌వ‌ర్న‌ర్ ఆరీఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్.. ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ కు స‌వాల్ విసిరారు. తన రాజకీయ జోక్యానికి ఒక్క ఉదాహరణ చూపాలని సీఎం పినరయి విజయన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. సీఎం ఒక్క ఉదాహరణ చూపితే తాను రాజీనామా చేస్తానని గవర్నర్ అన్నారు. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉందంటూ సీఎం పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు.

Kerala Governor Arif Mohammad Khan openly challenges CM Vijayan to show one example of political interference by him. Offers to resign if one example shown

— Press Trust of India (@PTI_News)

అలాగే, బంగారం స్మగ్లింగ్ స్కామ్‌పై ముఖ్య‌మంత్రి పిన‌రయి విజ‌య‌న్ పై ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. "స్మగ్లింగ్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రోత్సహిస్తున్నట్లు నేను చూస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య‌మంత్రి కార్యాల‌యం, ముఖ్య‌మంత్రికి సన్నిహితులైన వ్యక్తులు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడితే, నేను జోక్యం చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి" అని అన్నారు.  "నేను జోక్యం చేసుకోవలసిన సమస్యలు ఉన్నాయి. నేను (కేరళ సీఎం పినరయి విజయన్‌పై) ఎలాంటి ఆరోపణలు చేయలేదు. సీఎం కార్యదర్శిని తొలగించారు. సీఎకు తెలియకుండా కేసులో ఉన్న వారిని ఆదుకుంటున్నాడా? అప్పుడు, ఇది ముఖ్యమంత్రి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది" అని అన్నారు.

 

Gold smuggling case | For one month, I returned every file relating to the University... There is a 'Laxman Rekha' for everybody. CM not responding to the call of the Governor is crossing 'Laxman Rekha'... people in CM office were patronising the smuggling: Kerala Gov Arif M Khan pic.twitter.com/9pDFwXs4Rt

— ANI (@ANI)

ఇటీవ‌ల ప‌లువురు వ‌ర్సిటీల వీసీల‌ను రాజీనామా చేయాలంటూ కేరళ గవర్నర్ ఆరీఫ్ మహ్మ‌ద్ ఖాన్ ఆదేశించారు. అయితే,  తమకు జారీ చేసిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ ఏడుగురు వైస్ ఛాన్సలర్లు హైకోర్టును ఆశ్ర‌యించారు. వైస్ ఛాన్సలర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు గురువారం నాడు విచారించనుంది.

గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సమాంతర ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ బుధ‌వారం నాడు ఆరోపించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో పదేపదే జోక్యం చేసుకోవడం, వాటిని సంఘ్ పరివార్ నియంత్రణలోకి తెచ్చి ఉన్నత విద్యను కాషాయీకరణ చేసే ప్రణాళికలో భాగంగా ఈ విష‌యాల‌ను చూడాల‌ని ఆయ‌న అన్నారు. "ఉన్నత విద్యా రంగాన్ని రక్షించడం, కేరళకు వ్యతిరేకంగా ఎత్తుగడలను ప్రతిఘటించడం" కోసం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) కన్వెన్షన్‌ను ప్రారంభించిన తర్వాత ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు.

click me!